నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

0
TMedia (Telugu News) :

నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

టీ మీడియా, డిసెంబర్ 8, హైదరాబాద్‌ : గుజరాత్‌, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని విజయపురాలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చంగల్పట్టులో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 7.39 గంటలకు 3.2 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్‌ వెల్లడించారు. ఉదయం 8.46 గంటలకు మేఘాలయాలోని షిల్లాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని అధికారులు తెలిపారు. ఇక గుజరాత్‌లోని కచ్‌లో ఉదయం 9 గంటలకు భూకంపం వచ్చింది. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించారు. ఈ నాలుగు భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు.

Also Read : జిల్లాకు త్రీబుల్ ధమాఖా -భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube