వృద్ధురాలికి మిషన్ స్మైల్ సంస్థ చేయూత 

వృద్ధురాలికి మిషన్ స్మైల్ సంస్థ చేయూత 

0
TMedia (Telugu News) :

వృద్ధురాలికి మిషన్ స్మైల్ సంస్థ చేయూత

టీ మీడియా, జనవరి 07, పెద్దపల్లి:పట్టణంలో గల స్థానిక కమాన్ వద్ద  రాత్రి 7 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఒక వృద్ధ మహిళను వదిలేసి వెళ్లగా రాత్రి 11 గంటల ప్రాంతంలో అటువైపు నుండి వెళ్తున్న మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ తెలంగాణ కోశాధికారి బత్తిని అనిల్ కుమార్ ఆ అవ్వను పలకరిచగా,  తన పేరు లక్ష్మీ రాజవ్వ అని మరియు కోంత మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మిగితా విషయాలు చెప్పడం లేదు. చలిలో ఇబ్బంది పడుతున్న ఆ ముసలమ్మబాధకి చలించిన మిషన్ స్మైల్ సంస్థ బృందం వెంటనే స్పందించి మానవ హక్కుల అవగాహన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్  ద్వారా సఖి కేంద్రానికి ఫోన్ చేసి విషయం వివరించి ఆ అవ్వని సఖి కేంద్రానికి తరలించడం జరిగింది అర్ధరాత్రి సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ముసలవ్వను అండగా ఉన్న మిషన్ స్మైల్ సంస్థను పెద్దపల్లి ప్రజలు అభినందించారఈ కార్యక్రమంలో మిషన్ స్మైల్ సంస్థ ప్రధాన కార్యదర్శి పూసల అఖిల్ సంయుక్త కార్యదర్శి కాసిపాక ప్రశాంత్ ఆశిష్ సఖి కేంద్ర బృందం తదితరులు పాలుగోన్నట్టు గంగిపెళ్లి విద్యాసాగర్ టీ మీడియాకు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube