సిగరెట్‌ స్మోకింగ్‌ ప్రియులా..?

మీడియా, మార్చి 10

1
TMedia (Telugu News) :

సిగరెట్‌ స్మోకింగ్‌ ప్రియులా..? ఈ నిజాలు తెలుసుకోండి..!
టీ మీడియా, మార్చి 10,ఆరోగ్యం:ఆధునిక కాలంలో ధూమపానం ఒక ఫ్యాషన్‌గా మారింది. ఆడా, మగ తేడా లేకుండా యువత మత్తుకు బానిస అవుతున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో యువ ఉద్యోగులైతే పని ఒత్తిడి పేరుతో అదే పనిగా పొగ పీల్చేస్తున్నారు. ఫలితంగా యుక్త వయసులోనే ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం, గ్యాస్ట్రిక్ సమస్యలతోపాటు క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. సిగరెట్‌ తాగే అలవాటు మనిషి జీవన కాలాన్ని తగ్గిస్తుంది. ఒక సిగరెట్‌ తాగడం వల్ల 11 నిమిషాల ఆయుష్షు తగ్గిపోతుందని అధ్యయనాలు వెల్లడించారు. పొగ తాగే వాళ్ళు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు కూడా వ్యాధులు సోకే అవకాశం లేకపోలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి దాదాపు కోటి 10 లక్షల సిగరెట్లను స్మోకర్లు ఊది పడేస్తున్నారు. ఈ భయంకరమైన అలవాటు కారణంగా ప్రతి నిమిషానికి 10 మంది చనిపోతున్నారు. అయినప్పటికీ సిగరెట్‌ స్మోకింగ్‌ అలవాటు మరింత పెరుగుతున్నది. అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినం సందర్భంగా సిగరెట్‌ స్మోకింగ్‌ను మానుకోవాలని అనుకుంటున్న వారిలో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసే ప్రయత్నం చేద్దాం.
సిగరెట్‌ మానేస్తే బరువు పెరుగుతాం..
ధూమపాన అలవాటును మానేయడం వల్ల బరువు పెరగడం ఒక దుష్ప్రభావం కావచ్చు. కానీ తగ్గడం అనేది జరగదు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ధూమపానం మానేసిన తర్వాత ఒక వ్యక్తి సగటున 2 నుంచి 4 కిలోల బరువు పెరుగొచ్చు.

ధూమపానం మానేస్తే డిప్రెషన్‌లోకి..

ఇది పూర్తిగా తప్పు. డిప్రెషన్ అనే వ్యాధితో బాధపడేవారు మెల్లమెల్లగా స్మోకింగ్‌కు అలవాటు పడతారు. పొగతాగడం మానేసిన వారిలో డిప్రెషన్‌ లక్షణాలు బయటపడతాయని అమెరికన్‌ వైద్యులు తేల్చారు. అయితే, సరైన ఔషధం, కౌన్సెలింగ్‌తో దీనిని వదిలించుకోవచ్చు.

స్నేహితులను దూరం చేస్తుంది..
ధూమపానం చేసేవారు ఈ అలవాటును మానుకుంటే ఇతర స్మోకింగ్ చేసే స్నేహితులు దూరంగా ఉంటారని అనుకుంటుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. మీ ద్వారా స్నేహితులు కూడా స్ఫూర్తి పొందుతారు. స్మోకింగ్‌ మానేయడానికి గల కారణాన్ని చెప్పినప్పుడు.. వారు కూడా ఈ అలవాటును మానుకోవాలని భావిస్తారు.

స్మోకింగ్‌ చేయకపోతే అనారోగ్యం..
ధూమపానం మానేయడం వల్ల దగ్గు, జలుబు వంటి లక్షణాలు వస్తాయని కొందరు భయపడుతుంటారు. ఇది కొన్ని స్వల్పకాలిక దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, స్మోకింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. ఈ అలవాటును మానుకోవడం వల్ల అరోగ్యసమస్యలు ఎదురైనా ప్రాణాపాయం నుంచి బయటపడతారు.
సృజనాత్మకత తగ్గుతుంది..

Also Read : మరో స్టార్‌ హీరో

పొగతాగడం వల్ల తమ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. ధూమపానం మానేసినప్పుడు వ్యక్తుల సృజనాత్మకత పెరుగుతుంది. పని మధ్యలో పొగ త్రాగాల్సిన అవసరం లేనందున పనిపైనే ఎక్కువ దృష్టిసారించి మంచి ఫలితం పొందుతారు
సిగరెట్‌ ప్రియులు ఇప్పటికే ఏదైనా వ్యాధికి గురైనట్లయితే, ధూమపానం మానేయడం వల్ల మీకు మేలు చేస్తుందని గ్రహించండి. మీతోపాటు మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉంటారని మరిచిపోవద్దు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube