ఒక మహిళగా స్మృతి ఇరానీ అలాంటి వాఖ్యలు చేయడం సరికాదు

ఒక మహిళగా స్మృతి ఇరానీ అలాంటి వాఖ్యలు చేయడం సరికాదు

0
TMedia (Telugu News) :

ఒక మహిళగా స్మృతి ఇరానీ అలాంటి వాఖ్యలు చేయడం సరికాదు

– బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

టీ మీడియా, డిసెంబర్ 15, హైద‌రాబాద్ : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు. ” నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే ” అని కవిత ఎక్స్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read : రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube