చైన్ స్నాచర్ దొంగలను పట్టుకున్న పోలీసులు

0
TMedia (Telugu News) :

సుమారు లక్ష రూపాయల విలువచేసే బంగారం స్వాధీనం

టీ మీడియా అశ్వారావుపేట,దమ్మపేట డిసెంబర్ 04

వరుస దొంగతనాల కు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్న దమ్మపేట పోలిసులు. సర్కిల్ ఇస్పెక్టర్ బంధం ఉపేందర్ తెలిపిన వివరాలు ప్రకారం శనివారం దమ్మపేట ఎస్సై వెంకట్రాజు తన సిబ్బందితో కలిసి అల్లిపల్లి తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పాత కేసులో ముద్దాయిలు అయిన ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్లుతుండగా గమనించిన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ప్రధాన ముద్దాయి మూడు గణేష్ 24 సంవత్సరాలు, రెండోవ ముద్దాయి బాణోత్ గంగాధర్ లు నామవరం గ్రామం చింతలపూడి మండలం పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన ముద్దాయిలుగా గుర్తించారు. గతం లో వీరూ దమ్మపేట మండలం ముష్టిబండ బంగారు నగలు కేసులో ముద్దాయిలని తేలింది. ఈ మధ్య టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం,కొల్లివారిగూడెం,గంగన్న గూడెం గ్రామాల్లో మహిళలల మెడలో బంగారు త్రాడులను దొంగిలించామని ఈరోజు కూడా దమ్మపేట మండలం ఏరియాలో దొంగతనం చేసి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్ముటకు తీసుకెళుతున్నామని విచారణలో వారు చెప్పటం తో వారి వద్ద ఉన్న 96 వేల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకి పంపునున్నట్లు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన మూడు గణేష్ పై 8 బంగారు దొంగతనాల కేసులు ఉన్నాయి అని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి ఏమనగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్త వారు ఎవరైనా కనబడితే అనుమానాస్పదంగా అనిపిస్తే 100 కు డయిల్ చేయాలని,దగ్గరలో ఉన్న మీకు తెలిసిన పోలీసులకు సమాచారం అందించవలసిందిగా కోరారు. ఇంటి పరిసర ప్రాంతాలలో ప్రధానంగా సీసీ కెమెరాలు అమర్చుకోవలసిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dammapeta police nab robbers committing a series of thefts.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube