ఖర్జూరంతో ఎన్ని ప్రయోజనాలో.
-రోగనిరోధక శక్తిని బలోపేతం
లహరి, ఫిబ్రవరి 6, ఆరోగ్యం :చలికాలం అంటేనే సీజనల్ వ్యాధులు, ఆరోగ్య సమస్యలతో పోరాటం. ఈ కాలంలో వచ్చే సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడమే మార్గమని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపకరిస్తాయని అంటున్నారు. అయితే వారు తమ సూచనలలో భాగంగానే ఖర్జూరం పండు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కలుగుతాయని చెబుతున్నారు. అందుకు ఖర్జూరంలో ఉండే ఐరన్, మినరల్స్, కాల్షియం, అమినో యాసిడ్స్, ఫాస్పరస్, విటమిన్లు వంటి పలు పోషకాలు పుష్కలంగా ఉండడమే కారణం. అందుకే వర్క్‌అవుట్స్ చేసేవారు, క్రీడాకారులు ఖర్జూరాలను ఎకకువగా తీసుకుంటారు. ఒక ఖర్జూరంలో 23 కేలరీలు ఉంటాయి. ఖర్జూరం తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. ఇంకా ఖర్జూరం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఎముకల పటిష్టత: ఖర్జూరం ఎముకలని పటిష్టం చేయడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే లవణాలు ఎముకలను దృఢపరిచేందుకు పని చేస్తాయి. ఖర్జూరాలలో పుష్కలంగా ఉండే క్యాల్షియం, సెలీనియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
Also Read : దమ్ముంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి
రోగనిరోధక శక్తి: ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటివి పుష్కలంగా ఉండడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.చర్మానికి మేలు: ఖర్జూరం చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మంచి గ్లో కూడా వస్తుంది.బరువు: మీరు తక్కువ బరువు ఉన్నట్లయితే ఖర్జూరం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇది బరువును పెంచడానికి పని చేసే అనేక ముఖ్యమైన ప్రోటీన్లను కలిగి ఉంటుంది. మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే మంచిది. కొన్ని రోజుల్లో ఫలితాలను చూస్తారు.తక్షణ శక్తి: ఖర్జూరంలో తగినంత మొత్తంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. దీన్ని తిన్న వెంటనే శక్తి లభిస్తుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube