సామాజిక తనిఖీ ప్రజా వేదిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 15, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 14, 15 వ రౌండ్స్ లకు సంబందించి 2019-2020, 2020-2021 ఆర్ధిక సంవత్సరాలకు గాను 4/12/2021 నుండి 14/12/2021 వరకు అన్ని గ్రామ పంచాయతీల యందు సామాజిక తనిఖీ బృందాల నివేదికలను ప్రజా వేదిక నందు సమర్పించారు. ఉపాధి హామీ పథకం ఎమ్ సిసి కు గాను గోపవరం,బొల్లవరం 531 రూపాయల నగదును రికవరీ మరియు పెనాల్టీ క్రింద గోపవరం, అబ్బీపురం, తమ్మడపల్లి, బొల్లవరం నాలుగు వేల రూపాయ లను కన్వార్జెన్సీ డిపార్ట్మెంట్స్ అయిన అటవీశాఖ,డిఆర్ డిఎ, వైకేపి, హోసింగ్, పంచాయతీ రాజ్, సమగ్ర శిక్ష వారి నుండి 167359/- రూపాయలను రికవరీ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. అమర్ నాథ్ రెడ్డి, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్స్& వాటర్ షెడ్స్ బాల కృష్ణా రెడ్డి, సలీం బాషా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ సిద్ద లింగ మూర్తి,మండల పరిషత్ అధ్యక్షులు కుమారి బి. యశస్విని, ఎంపీడీఓ సుబ్బ రాజు, జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి, మసీదుపురం, బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube