కేసీఆర్ కు వెన్నుదన్నుగా సమాజం

కలకాలం జీవించాలి

0
TMedia (Telugu News) :

కేసీఆర్ కు వెన్నుదన్నుగా సమాజం

– కలకాలం జీవించాలి

-ఎంపీనామ జన్మ దిన శుభాకాంక్షలు

టీ మీడియా, ఫిబ్రవరి 17 ,ఖమ్మం : అబ్ కీ బార్ సర్కార్ నినాద ప్రదాత, తెలంగాణ విధాత, భావి భారత నిర్మాత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావుకు హార్ధిక జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పార్టీ లోక్ సభ నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. రేపటి నవీన భారతాన్ని నిర్మించేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ కు యావత్ తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా నిలుస్తుందని నామ పేర్కొన్నారు. ఆయన సమర్థ నాయకత్వానికి దేశమంతా మద్దతు లభిస్తుందని, నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్న దేశ్కీ నేత, అలుపెరుగని నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశ ప్రజలకు ఆయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారని చెప్పారు. భారత్ ను అగ్ర దేశంగా నిలిపే వ్యూహాత్మక ప్రణాళికలు కేసీఆర్ సొంతమన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ వారంతా ఆశగా, ఆనందంగా ఆయనను స్వాగతిస్తున్నారని అన్నారు. 8 ఏండ్లలో తెలంగాణ గతిని మార్చి, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్ గా నిలిపిన ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కు తుందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్చూచిగా చేశారని అన్నారు. కేసీఆర్ సమర్ధవంతమైన పాలనను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని, తెలంగాణ పథకాలు దేశమంతా అమలు జరపాలని కోరుకుంటూ బీఆర్ఎస్ ను విశ్వసిస్తూ, ఆదరిస్తూ, అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు.

Also Read : సీఎం కేసీఆర్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.

తెలంగాణ ప్రగతి కాంతులను దేశం నలుమూలలా వెదజల్లేందుకు కేసీఆర్ ప్రగతికాముక దేశాల స్పూర్తితో, ఆత్మ విశ్వాసంతో దేశ ప్రగతి కోసం ముందుకు సాగుతున్న ఆయనకు మనమంతా కొండంత అండగా నిలవాలన్నారు. కేవలం 8 ఏండ్లలో దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన 4వ రాష్ట్రంగా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా, పారిశ్రామిక, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దారని అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా, గ్రీన్ సిటీగా, ప్రశాంతతకు నిలయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఆచరణకు, జ్ఞాన శక్తికి ముగ్ధులై, ప్రజా నేత కేసీఆర్ భారత్ ను కూడా ప్రగతి పధాన పరుగెత్తించగలడన్న సంపూర్ణ విశ్వశాసంతోనే యావత్ దేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నదని నామ పేర్కొన్నారు. ఈనెల 17న శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మ దిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారని నామ చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube