మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం

-ఎంపీపీ సామినేని హరిప్రసాద్

1
TMedia (Telugu News) :

మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం

-ఎంపీపీ సామినేని హరిప్రసాద్

టీ మీడియా,డిసెంబర్ 5,ముదిగొండ: రైతువేదిక కేంద్రంలో ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా జనాభాను పోషించడానికి కావాల్సిన ఆహారోత్పత్తి సాధ్యమవుతుంది. అయితే, నానాటికీ నేల పైపొర దెబ్బతింటోంది. ఇది ఆహార భద్రతపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది . మానవాళికి అందే ఆహారంలో 95శాతాన్ని నేల అందిస్తుంది అన్నారు.జడ్పిటిసి పసుపులేటి దుర్గా వెంకట్* మాట్లాడుతూమితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల పోనుపోను నేల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఫలితంగా మన ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. ఆరోగ్యవంతమైన నేలలు స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి, ఆహార భద్రతకు కీలకం.

Also Read : మావోయిస్టు కొరియర్ అరెస్ట్

నేల సహజత్వాన్ని కాపాడటానికి, ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించడానికి, పేదరిక నిర్మూలనకు కృషి చేసిన థాయ్లాండ్ రాజు భూమిబోల్ జయంతిని ప్రపంచ మృత్తికా దినోత్సవంగా జరుపుకొంటున్నాం.అందుకే ప్రతి ఏటా డిసెంబరు అయిదున ప్రపంచ మృత్తికా దినోత్సవం జరుపుతున్నారు అన్నారు . ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారిని రాధ ,ఏఇఓ మౌనిక సర్పంచ్ మందరపు లక్ష్మీ, కోటి అనంతరాములు,టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి ఉపసర్పంచ్ తాళ్ల శ్రీను, ఎంపీటీసీ రాంబాబు, దిశకమిటి నెంబర్ చింతల చెర్వు లక్ష్మీరైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ సభ్యులు, రైతులుతదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube