టీ మీడియా,డిసెంబర్ 8,కరకగూడెం;
కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు డిస్ర్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్(డి ఎన్ టీ) వారి సహకారంతో విద్యార్థులకు సోలార్ ద్వీపాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కే నాగేశ్వర రావు మాట్లాడుతూ…పదివ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోలార్ ద్వీపాలు ఎంతోగాని ఉపయోగ పడుతుందని,విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు ఊకే రామనాథం,విద్య కమిటీ కో ఆప్షన్ సభ్యులు కొంపెళ్ళి పెద్ద రామలింగం,గొగ్గల నర్సయ్య,ఉపాధ్యాయులు లక్ష్మణ్,స్వాతి,వెంకటేశ్వర్లు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.