టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 08
మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో బుధవారం డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ పౌండేషన్ వారి ఆధ్వర్యంలో సౌర శక్తి దీపాలను
పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పత్తేపరపు రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు కరెంటు పోయినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువుకునేందుకు డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ వారు ఒక మంచి ఆలోచనతో పేద విద్యార్థులకు సౌర శక్తి దీపాలు ఇచ్చి మంచి సహకారం అందింస్తున్నారని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి స్కూల్ కి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఇటువంటి సహకారం డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ వారు అందించినందుకు వారికి మా విద్యార్థుల తరుపున మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు యూ యస్ ప్రకాశరావు,స్కూల్ చైర్మన్ దివిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.