టీ మీడియా,డిసెంబర్ 6,కరకగూడెం;
కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల కేంద్రంలోనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 65 వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,కార్యదర్శి షేక్ యాకూబ్, మహిళా నాయకురాలు చందా వెంకట రత్నమ్మ, యువజన నాయకులు వజ్జా మహేష్ తదితరులు పాల్గొన్నారు.