పరుగు పందెం వీరుడికి ఘన సన్మానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 ,కరకగూడెం:

గత నెలలో జాతీయస్థాయి గోవాలో జరిగినటువంటి పరుగు పందెం పోటీలలో ఏజెన్సీ కరకగూడెం మండల కేంద్రంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ కలవల నాగారం గ్రామానికి చెందిన ఇర్ప వెంకట నరసయ్య-నాగమణి దంపతుల ప్రథమ పుత్రుడు, ఆదివాసి విద్యార్థి క్రీడాకారుడు ఇర్ప నాగ కృష్ణ పట్టుదలతో ఐదు కిలోమీటర్ల విభాగంలో వ్యక్తిగత గోల్డ్ మెడల్, ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే విభాగంలో మరొక గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్ర తరపున సాధించినందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో అతని ఇంటి వద్ద ఇర్ప నాగ కృష్ణ అభినందించి,ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పరుగు వీరుడు నాగ కృష్ణ మాట్లాడుతూ… నేను గోవా వెళ్లడానికి ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులలో గ్రామ పెద్దలు,వివిధ మిత్రులు,తోటి స్నేహితులు నా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని చాలా మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి ఈ విజయం సాధించేందుకు ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
స్థానిక సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి మాట్లాడుతూ… పరుగుపందెం పోటీలు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మన రాష్ట్రానికి,మన మండలానికి,గ్రామపంచాయతీకి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాగ కృష్ణ తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు,యువత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube