టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 26
భారత రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వాడ వాడ న నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు ఘన నివాళులు అర్పించారు.1979 నుండి 2015 నవంబర్ 26 వరకు ఇదే రోజును న్యాయ దినోత్సవం గా జరుపుకునేవారు.2015 అంబేద్కర్ 125 జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించటం తో అప్పటినుండి దేశ ప్రజలు అట్టహాసంగా ఆ వేడుకలను నిర్వహించుకుంటున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ కేంద్రం లో అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్డులో ఉన్నా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం పునాదులుగా భారత రాజ్యాంగం తన జాతి జనులకు రక్షణ కవచం గా నిలుస్తున్నదని
రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో సామాజిక సమానత్వాన్నీ సాధించాలనేది రాజ్యాంగ రూపకర్తల భావనని ఆ విషయాన్ని రాజ్యాంగ ప్రవేశికలోనే స్పష్టంగా పేర్కొన్నారని
రాజ్యాంగం ద్వారా సాకారం చేసుకోవాల్సిన వాటిని అంశాలవారీగా పరిశీలిస్తే
మొదటిగా సమానన్యాయం సాధించాలని న్యాయం ఒక సర్వోన్నతమైన సమతా భావన.
అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం భారత రాజ్యాంగ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సత్యవరపు సంపూర్ణ, రాజమోహన్ రెడ్డి, యూ స్ ప్రకాశ్ రావు, జుజ్జురి వెంకన్న,మోటూరి మోహన్,తదితరులు పాల్గొన్నారు.