ప్రజా సమస్యల పరిష్కారం కై పల్లెనిద్ర
-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
టీ మీడియా, డిసెంబరు 1, వనపర్తి బ్యూరో : ప్రజల సమస్యల పరిష్కారమే పల్లెనిద్ర ఎజెండా అని, దృష్టికి వచ్చిన సమస్యల వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామంలో పల్లెనిద్రలో భాగంగా ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి ఆయన హామీచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని మరే రాష్ట్రంలో గ్రామాలలో ఇలాంటి పథకాలు అమలుకావడం లేదన్నారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాల నిర్మాణంతో పల్లెలకు కొత్త శోభ వచ్చిందని, పల్లె ప్రగతితో గ్రామాలు బఫ, నీళ్ల ట్యాంక్ కేటాయింపుతో చెత్త సేకరణ, చెట్ల పెంపకానికి ఇబ్బందులు. తొలగి పోయాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగయ్యాయి. ఒకనాడు పల్లెలు తాగునీటికి తండ్లాడేవి. మిషన్ భగీరధతో నేడు తెలంగాణలో ఎక్కడా ఆ సమస్య లేదు. సాగునీటి రాకతో గ్రామాల నుండి వలసలు తగ్గాయి.
Also Read : నివాళులు అర్పించిన మంత్రి
ఒకనాడు వలసెల్లిన కుటుంబాలు వెనక్కి వచ్చాయి. భీడుభూములు. సస్యశ్యామలమయ్యాయి. పంట రాశులతో పల్లెలు. కళకళలాడుతున్నాయి. గ్రామాలలో మౌళిక వసతుల కల్పన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుచూపు ప్రణాళికల ఫలితంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు.