అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాస్తారోకో

అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాస్తారోకో

0
TMedia (Telugu News) :

అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాస్తారోకో

టీ మీడియా, డిసెంబర్ 22, చింతూరు : అంగన్వాడి కార్మికలా సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 11 రోజు సమ్మె చేస్తున్న సందర్భంలో రాస్తారోకో కార్యక్రమం చింతూరు సెంటర్లో చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు వెంకట్ పాల్గొని మాట్లాడుతూ.. అంగన్వాడి కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా 11 రోజు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు ఇదే పద్ధతిలో పోతే మాత్రం కచ్చితంగా ఓటు హక్కుతో సమాధానం అంగన్వాడీ కార్మికులు అందరూ కూడా చెప్తారని అన్నారు. ప్రభుత్వానికి అంగన్వాడీ కార్మికులు ఏమైనా గొంతెమా కోరికలు ఏం కోరడం లేదు మా సమస్యలు పరిష్కారం చేయండి అని అడుగుతున్నారు.

Also Read : క్రీస్తు జ్యోతి పాఠశాలలో ఘనంగా సెమీ క్రీస్మస్ వేడుకలు

25వ తారీకు దాకా మా సమ్మెను కొనసాగిస్తాం అప్పుడు కూడా మా సమస్య లు పరిష్కారం చేయకపోతే 26వ తారీకు నుండి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేక రాజకుమార్ . సీఐటీయూ మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్. అంగన్వాడీ కార్మికులు. జయ. నూకరత్నం. కామేశ్వరి. పార్వతి. దుర్గా. సత్యవతి. విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube