పిఎంపి, ఆర్ఎంపీ ల సమస్యలు పరిష్కరించండి

పిఎంపి, ఆర్ఎంపీ ల సమస్యలు పరిష్కరించండి

0
TMedia (Telugu News) :

పిఎంపి, ఆర్ఎంపీ ల సమస్యలు పరిష్కరించండి

– మన్సూర్ అలీ

టీ మీడియా, డిసెంబర్ 22, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రి.నెం. 1277/97 ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ డివిజన్లోని ఆర్ఎంపి పి.ఎం.పి సంఘ నాయకులతో కలిసి హైదరాబాదులోని నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి నివాసంలో టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని కలిసి పూల బొకేలు ఇచ్చి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలోని 40000 వేల మంది ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యుల కుటుంబాలకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరు నెలల శిక్షణ ఇచ్చి 2009 జీవో యాక్ట్ ను సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునే విధంగా చూడాలని, ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాష్ట్ర నీటిపారుదల గృహ నిర్మాణ శాఖ మాత్యులు కెప్టెన్ నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సహాయం న్యాయం చేయాలని, హుజూర్నగర్ డివిజన్ ఆర్ఎంపి పీఎంపీల సమక్షంలో సూర్యాపేట జిల్లా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ కోరి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషిచేసిన ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు కృతజ్ఞతలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ఎంపి పిఎంపీలకు త్వరలోనే ఆరు నెలల శిక్షణ ఇచ్చి 2009 యాక్ట్ ను కచ్చితంగా అమలు చేస్తామని, ఆర్ఎంపి పిఎంపీలకు భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినారు .

Also Read : అద్దె బస్సుల‌కు టిఎస్ఆర్టీసీ నోటిపికేష‌న్

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ బాబు మఠంపల్లి మండల అధ్యక్షులు శంషుద్దీన్ నేరేడుచర్ల మండల అధ్యక్షులు ఉపేంద్ర ప్రసాద్, చింతలపాలెం మండల అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, రాంబాబు, హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు ,బాస రామారావు, మొక్క శివ, ఆదినారాయణ ఆత్కూరిశ్రీనివాస్ , పాలోజుబ్రహ్మం, కే. పూలరాజు, కొండా శ్రీను ,తోట ప్రకాష్ పి. నాగయ్య షేక్ జానీ కే శ్రీనివాస్ షేక్ హసన్ నరసింహారావు, శ్రీకాంత్ , హుజూర్నగర్ నియోజకవర్గంలోని ముఖ్య సీనియర్ ఆర్ఎంపిపీఎంపీలు పాల్గొన్నారు .

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube