సోమనాద్రినగర్‌కు పొంచి ఉన్నముప్పు

సోమనాద్రినగర్‌లో మట్టి కోటకు ఆనుకొని ఉన్న ఇళ్లు

1
TMedia (Telugu News) :

సోమనాద్రినగర్‌కు పొంచి ఉన్నముప్పు
-సోమనాద్రినగర్‌లో మట్టి కోటకు ఆనుకొని ఉన్న ఇళ్లు
-వర్షాకాలంలోనే అధికారుల హడావిడి
-ప్రత్యామ్మాయంపై దృష్టి సారించని పాలకులు
టి మీడియా,జులై15,గద్వాల టౌన్‌ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గద్వాల పట్టణం నడిబొడ్డున్న మట్టి కోట గోడలకు ఆనుకుని ఉన్న సోమనాద్రి నగర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో స్థానికులు ఖాళీ చేయాలంటూ అధికారులు హడావిడి చేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో కాలనీవాసులు కోటగోడ పరిసరాల్లోని పాతపడిన ఇళ్లలోనే నివసిస్తున్నారు.

 

Also Read : అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్‌

ఖాళీ స్థలంలో వెలసిన ఇళ్లు
దాదాపు 450 సంవత్సరాల క్రితం నిర్మితమైన గద్వా ల కోట చుట్టూ రక్షణ కోసం విశాలమైన, లోతైన కందకాన్ని ఏర్పాటు చేసిన అప్పటి సంస్థాన పాలకులు కందనానికి, కోట గోడకు మధ్య విశాలమైన ఖాళీ స్థలా న్ని వదిలారు. అప్పట్లో అలా వదిలిన ఖాళీ స్థలంలో పూలమొక్కలు ఉండేవని స్థానిక పెద్దలు చెప్తుంటారు. అయితే కాలక్రమంలో ఆ ప్రాంతమంతా ఖాళీ ఏర్ప డింది. అక్కడ కొందరు గుడిసెలు వేసుకుని జీవనం సాగించారు. అనంతరం కాలంలో పక్కా ఇళ్లు కట్టు కున్నారు. అలాంటి కుటుంబాల సంఖ్య అప్పట్లో 50కి మించి లేకపోవడం గమనార్హం. అనేక ఏళ్ల పాటు ఈ తతంగం సాఫీగా సాగినా, 2009లో భారీ వర్షాల కారణంగా పాతబడిన కోట గోడల నుంచి మట్టిపెళ్లలు విరిగిపడటం ప్రారంభమైంది. దీంతో అప్పటి అధికా రులు సోమనాద్రినగర్‌ వాసులను సురక్షిత ప్రాంతాలకు (పునరావాస కేంద్రాలు) తరలించారు. అలా తరలించిన వారి కుటుంబాల సంఖ్య 60 దాటలేదన్నది అధికారుల ద్వారా అందిన సమాచారం. ఇళ్లు ఖాళీ చేయించడంతో పాటు, అక్కడ నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి ప్రత్యామ్మాయంగా పిల్లిగుండ్ల కాలనీ తదితర చోట్ల వారికి నివేశన స్థలాలు ఇచ్చారు.
కాలనీలో సౌకర్యాల కల్పన
అప్పట్లో సోమనాద్రినగర్‌లో నివసిస్తున్న కుటుంబాల్లో ఐదారు కుటుంబాలను మినహాయిస్తే, మిగతా వారందరికీ ఇళ్ల స్థలాలు అందాయి. అయినా వారు పాత ఇళ్లను తమ ఆధీనంలోనే ఉంచుకుని అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. వారిని అడ్డుకునేవారు లేకపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది. దీనికి తోడు కాలనీలోని ఇళ్లకు విద్యుత్‌, తాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు, కొన్ని ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం కూడా లభించడంతో పక్కాఇళ్లు కట్టుకున్నారు. దీనిని అధికారిక కాలనీగా ఇక్కడి కుటుంబాల వారు భావిస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఇళ్లను ఖాళీ చేయి స్తున్న అధికారులు, మిగతా సమయాల్లో అటువైపు తిరిగి చూడడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోట మట్టి గోడలు కూలిపోయి ఆ ఇళ్లపై పడే ప్రమాదముంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ప్రమాదాన్ని గుర్తించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత్యంతరం లేక నివసిస్తున్నాం సవారన్న, కాలనీవాసి : పట్టణంలో వేలు, లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదు. గత్యంతరం లేక ఇక్కడే నివసిస్తున్నాం. ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నా, దేవుడిపై భారం వేసి ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. వర్షాకాలంలో ప్రాణ భయం ఉన్నా, ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం.

 

Also Read : గోదారమ్మ ఉగ్రరూపం.

ప్రత్యామ్నాయం చూపితే వెళ్లిపోతాం బీబీ, కాలనీవాసి :వర్షాకాలంలో పాతబడిన కోట గోడతో ప్రమాదం పొంచి ఉందన్న భయం ఉన్నా వేరే చోటుకు వెళ్లలేకపోతున్నాం. అధికారులు ప్రత్యామ్నాయం చూపితే ఇళ్లను శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాకాలంలో హెచ్చరికలు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత మా గురించి పట్టించుకోవడం లేదు.

అందరికీ నోటీసులు అందించాం: జానకీరామ్‌ సాగర్‌, మునిసిపల్‌ కమిషనర్‌

ఏకధాటిగా కురిసే వర్షం వల్ల ప్రమాదం ఉన్నట్లు గుర్తించాం. సోమనాద్రినగర్‌లో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు అందించాయం. నిరాశ్రయలు అయిన వారికి తాత్కాలికంగా బాలభవన్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రత్యా మ్నాయం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube