బీహార్ సీఎం తినే ఆహారంలో ఎవరో విషం కలిపినట్టున్నారు
బీహార్ సీఎం తినే ఆహారంలో ఎవరో విషం కలిపినట్టున్నారు
బీహార్ సీఎం తినే ఆహారంలో ఎవరో విషం కలిపినట్టున్నారు
– జితన్‌రామ్ మాంఝీ
టీ మీడియా, నవంబర్ 10, పాట్నా: బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అసెంబ్లీ సాక్షిగా తనపై విమర్శలు చేయడాన్ని హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ అధ్యక్షుడు జితన్‌రామ్ మాంఝీ తప్పుపట్టారు. నితీశ్‌కుమార్ సీఎం కుర్చీని లాక్కునేందుకు ఆయన తినే ఆహారంలో ఎవరో విషం కలిపి ఉంటారని, ఆ విషం ప్రభావంతోనే ఆయన రెండు రోజుల క్రితం మహిళల గురించి, నిన్న నా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాంఝీ ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీలో కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా జితన్‌రామ్ మాంఝీ మాట్లాడుతూ.. కుల గణన సర్వే సక్రమంగా జరిగనట్లు తనకు అనిపించడంలేదని, ఒకవేళ ఆ డేటాలో తప్పులు ఉంటే సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధి దారులకు దక్కకుండా పోతాయని అన్నారు. దీనిపై నితీశ్ స్పందిస్తూ.. ‘2014లో మాంఝీని మేం సీఎంను చేశాం. నేను సీఎంగా పనిచేసిన అని ఆయన ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆయనకు ఏమైనా పరిజ్ఞానం ఉన్నదా..? ఏదో నా మూర్ఖత్వం వల్ల నాడు సీఎం అయ్యారు’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా కూడా నితీశ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read : హిందుత్వ పరిరక్షణకు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ పిటిషన్
‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు భగ్గుమనడంతో నితీశ్ క్షమాపణలు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాంఝీ ఇవాళ నితీశ్ మానసిక స్థితిని ఎగతాళి చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube