సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందే
-తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
టీ మీడియా, జనవరి 10,హైదరాబాద్ : సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను తెలంగాణకు కేటాయించటాన్ని రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని సూచిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. కేంద్రం ఉత్తర్వులు నిలిపేసి తెలంగాణలో కొనసాగేలా క్యాట్ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది.