17న కొడుకు,19న తండ్రి ఆత్మహత్య

17న కొడుకు,19న తండ్రి ఆత్మహత్య

0
TMedia (Telugu News) :

17న కొడుకు,19న తండ్రి ఆత్మహత్య
-విద్యార్థి కుటుంబం లో విషాదం

టీమీడియా, డిసెంబర్ 19, ఖమ్మం/సత్తుపల్లి: ఖమ్మంలోని ఓ పాఠశాల యాజమాన్యం అతి ఉత్సాహం ని చూపి ఓ నిండు ప్రాణాన్ని తీసేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ సంతోషంగా ఉన్నడనుకున్న క్షణాలు అంతలోనే విషాదంగా మారాయి. పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఘటన ఖమ్మంనగరం లో 17 న చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… మమత హాస్పిటల్ వెనుక రోడ్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న భాను ప్రకాష్ అనే విద్యార్థి తన పుట్టిన రోజు వేడుకలను సరదాగా తరగతి గదిలో స్నేహితుల సమక్షంలో జరుపుకున్నందుకు పాఠశాల యాజమాన్యం తీవ్రంగామండలించడం తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కొడుకు మరణం జీర్ణించుకోలేక తండ్రి రాంబాబు ఆదివారం(19న)తెల్లవారుజామున ఉరి వేసుకొని మరణించారు.

యాజమాన్యం ప్రవర్తన ఇలా..

బంధువులు కథనం ప్రకారం స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. సీసీ ఫుటేజీలో నమోదైన నా బర్త్ డే వేడుకలను చూసిన యాజమాన్యం ఆ విద్యార్థి పై అనేక విధాలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటి విద్యార్థుల సమక్షంలో యజమాన్యం వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగినట్లు తెలిపారు. విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
తండ్రి మరణం ఇలా..
ఖమ్మం జిల్లా :
సత్తుపల్లిలో చల్ల రాంబాబు(36) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య.
రాంబాబు కొడుకు బాను ప్రకాష్ పదవ తరగతి చదువుతున్నాడు , ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి చికిత్స పొందుతూ హైదరాబాద్ లో నిన్న మృతి చెందాడు.
మనోవేదనకు గురైన తండ్రి రాంబాబు ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకుని అత్మ హత్యచేసుకొన్నాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube