అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం

అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటన

1
TMedia (Telugu News) :

అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం
-అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటన

టీ మీడియా ,సెప్టెంబర్‌ 24,ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికకు సోనియా గాంధీ కుటుంబం దూరంగా ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అధికారికంగా ప్రకటించారు.

Also Read : ఘనంగా ఎమ్మెల్యే కోరుకంటి జన్మదిన వేడుకలు

ప్రస్తుతం అధ్యక్ష రేసులో గెహ్లాట్‌ అధికారికంగా నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నారు. గురువారం సాయంత్రం అశోక్‌ గెహ్లాట్‌, రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. పార్టీ అధ్యక్ష పదవికి తమ కుటుంబం దూరంగా ఉంటుందని స్వయంగా రాహుల్‌ వెల్లడించినట్లు గెహ్లాట్‌ తెలిపారు.కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని వస్తున్న విజ్ఞప్తులను అంగీకరించాలని అతన్ని(రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ..) కోరాం. కానీ, తాను కాదు కదా తన కుటుంబం నుంచి కూడా ఎవరూ అధ్యక్ష బరిలో ఉండబోరని ఆయన స్పష్టం చేశారు అని గెహ్లాట్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube