పోలీస్ కుటుంబాలకు చేయూత నగదును అందజేసిన ఎస్పీ

పోలీస్ కుటుంబాలకు చేయూత నగదును అందజేసిన ఎస్పీ

0
TMedia (Telugu News) :

పోలీస్ కుటుంబాలకు చేయూత నగదును అందజేసిన ఎస్పీ

టి మీడియా,జూలై22,భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ఎస్సై గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన SK.యాసిన్ గారి కుటుంబానికి మరియు ఇల్లందు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీరభద్రం గారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున చేయూత నగదును చెక్కుల రూపంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ కుటుంబంలో పనిచేస్తూ మరణించిన అధికారులు,సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.అదే విధంగా పోలీస్ శాఖ తరపు నుండి గానీ,ప్రభుత్వం తరపు నుండి రావాల్సిన అన్ని ప్రతిఫలాలను వీలయినంత త్వరలో వారి కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

Also Read : వర్షంలో ను మిషన్ భగీరథ కార్మికులు దీక్ష

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ వెంకటేశ్వర్లు,సూపరింటెండెంట్ సత్యవతి,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఏసోబు మరియు తదితరులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube