ఆటల పోటీలు విజయవంతం అయ్యేలా ప్రత్యేక కమిటీలు

ఆటల పోటీలు విజయవంతం అయ్యేలా ప్రత్యేక కమిటీలు

0
TMedia (Telugu News) :

ఆటల పోటీలు విజయవంతం అయ్యేలా ప్రత్యేక కమిటీలు

టి మీడియా, డిసెంబర్ 27, భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నాలుగుఐటీడీఏ పరిధిలోని గిరిజన బాలబాలికలకు జోనల్ లెవెల్లో ఎంపిక చేయబడిన క్రీడాకారులకు జరుగు ఆటల పోటీలను విజయవంతంగా అయ్యేలా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.బుధవారం తన ఛాంబర్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏటీడీవోలతో వచ్చేనెల 4 జనవరి 2024 నుండి 6 జనవరి 2024 వరకు కిన్నెరసాని లోని క్రీడా పాఠశాలలో జరుగు రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలకు ఏర్పాట్లపై సంబంధించిన ప్రత్యేక సమావేశమును ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన బాలబాలికలకు జోనల్ లెవెల్లో జరిగిన క్రీడలలో గెలుపొందిన వారికి క్రీడలు నిర్వహిస్తున్నందున దాదాపు 2000 మంది క్రీడాకారులు పాల్గొంటున్న, ఈ క్రీడలలో పాల్గొను క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి మంచి పుష్టికరమైన భోజనంతో పాటు వసతి కల్పించాలని, అలాగే క్రీడాకారులు ఏఏ క్రీడలలో పాల్గొంటారో వాటికి సంబంధించిన క్రీడా స్థలాలు వారికి అనుకూలంగా సిద్ధం చేయాలని సంబంధించిన క్రీడల అధికారి క్రీడాస్థలాలు ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ దృష్టికి తీసుకొని వెళ్లి మరమ్మత్తులు చేయించుకోవాలని క్రీడాకారులకు అనువుగా ఉండే క్రీడా స్థలాలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు.

Also Read : మంథని కి బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు

ఏమాత్రం అశ్రద్ధ వహించిన మన నిర్వహించే క్రీడల పట్ల రాష్ట్రంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు కల్పించాలని, అందుకు సంబంధిత ఏటీడీవోలు, కమిటీ మెంబర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్రీడలలో పాల్గొను బాల బాలికల తో పాటు వారి వెంట వచ్చే లైజన్ ఆఫీసర్లు, కోచ్ లు, పి డీలు, పీఈటీలకు ఉండడానికి సరిపడా సౌకర్యాలు కల్పించాలని, చలికాలం నడుస్తున్నందున ప్రతి ఒక్కరికి రగ్గులు ,జంఖానాలు, క్రీడలలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన మెనూ ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినితోపాటు సంబంధిత పిడీలు పి ఈ టి లు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏ సి ఎం ఓ రమణయ్య, బి.గోపాలరావు క్రీడల అధికారి, ఏటీడీవోలు నర్సింగరావు, చంద్రమోహన్, జహీరుద్దీన్, రూపా దేవి, ఏఎస్ఓ వెంకటనారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, నెహ్రు, తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube