భద్రాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
భద్రాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
భద్రాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
టీ మీడియా, ఫిబ్రవరి 16, భద్రాచలం : నూతన ఆలయ ఇంచార్జ్ ఈవో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. రమాదేవి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన నూతన ఈవో కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచన అందించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా దేవి భద్రాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవో బాధ్యతలు స్వీకరించారు.