విజయ ఏకాదశి ప్రత్యేకతలేంటో..

విజయ ఏకాదశి ప్రత్యేకతలేంటో..

0
TMedia (Telugu News) :

విజయ ఏకాదశి ప్రత్యేకతలేంటో..

లహరి, ఫిబ్రవరి 7, ఆధ్యాత్మికం : హిందూ మత విశ్వాసాల ప్రకారం, సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటేమో శుక్ల పక్షంలో వస్తుంది. మరొకటి క్రిష్ణ పక్షంలో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన గురువారం రోజున విజయ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శత్రువులపై విజయం సాధించే వరం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈరోజున శ్రీ మహా విష్ణువును పూజించి ఉపవాసం ఉండటం వల్ల ప్రతి పనిలోనూ, మీరు చేసే ప్రయత్నాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మరణం అనంతరం కూడా మోక్షం లభిస్తుంది. ఇదిలా ఉండగా విజయ ఏకాదశి విశిష్టత ఏంటి.. శుభ ముహుర్తం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…


పురాణాల ప్రకారం, శ్రీరాముడు సాగర తీరంలో లంకను దాటేందుకు సిద్ధమవుతున్నప్పుడు, ఆ సమయంలో వక్దాల్బ్య మహర్షి శ్రీరాముడికి విజయ ఏకాదశి నిర్వహించమని సలహా ఇచ్చారు. ఆ మహర్షి చెప్పిన నియమాల ప్రకారం, రాముడు ఈ వ్రతాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత సాగరాన్ని దాటలనే పథకం విజయవంతం కావడంతో, తను రావణుడిని కూడా జయించగలిగాడు.
శుభ ముహుర్తం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈసారి 16 ఫిబ్రవరి 2023 గురువారం నాడు ఉదయం 5:32 గంటల నుంచి మరుసటి రోజు 17 ఫిబ్రవరి 2023 అర్ధరాత్రి 2:49 గంటల వరకు ఉంటుంది.

పూజా ముహుర్తం : 16 ఫిబ్రవరి 2023న ఉదయం 7:03 గంటల నుంచి ఉదయం 8:26 గంటల వరకు
విజయ ఏకాదశి వ్రతాన్ని 17 ఫిబ్రవరి 2023న ఉదయం 8:01 గంటల నుంచి ఉదయం 9:13 గంటల వరకు జరుపుకుంటారు.
విజయ ఏకాదశి రోజున విష్ణు పూజ చేసే సమయంలో ఈ మంత్రాలను జపించాలి.

‘ఓం నారాయణాయ లక్ష్మీ నమః’
అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

‘ఓం సియా పతియే రామ్ రామాయ నమః’
అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి.

‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’
అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
విజయ ఏకాదశి ప్రాముఖ్యత..

Also Read : చేతిపై భద్రయోగముంటే..

పూర్వం ద్వాపర యుగంలో ధర్మరాజుకు యుధిష్టరుడికి మాఘ మాసంలో వచ్చే ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆ సమయంలో క్రిష్ణుడిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడు. రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి లంకలో ఉంచినప్పుడు, తనతో యుద్ధం చేసేందుకు సుగ్రీవుడు సైన్యంతో పాటు లంకకు బయలుదేరుతాడు. అప్పుడు లంకకు వెళ్లాలంటే మధ్యలో ఉండే సముద్రాన్ని దాటాలి. అయితే వానర సైన్యానికి అది చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు రాముడు ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో సాగర తీరంలో ఓ మహర్షి వచ్చి మీరంతా ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించడం వల్ల సాగరాన్ని దాటొచ్చని చెబుతాడు. తన మాట ప్రకారం, రాముడితో పాటు వానరులు మొత్తం మాఘ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయడంతో పాటు రామసేతును నిర్మించి, సాగరం మీదుగా రాముడు లంక చేరుకుని రావణుడిని సంహరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube