ఉదయాన్నే ప్రోటీన్లతో నిండి ఉండే టిఫిన్

-స్పెషల్ ఇడ్లీ ట్రై చేస్తే సరి

0
TMedia (Telugu News) :

ఉదయాన్నే ప్రోటీన్లతో నిండి ఉండే టిఫిన్

-స్పెషల్ ఇడ్లీ ట్రై చేస్తే సరి

లహరి, పిబ్రవరి 24, ఆరోగ్యం :ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆడవారు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపం నివారణకు వివిధ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరిలో అయితే ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఇంటి చిట్కాలతో ప్రోటీన్ లోపం నుంచి బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ప్రోటీన్ లోప నివారణకు సోయాబీన్ ఓ మంచి ఎంపికని వారు చెబుతున్నారు. సోయాబీన్ అనామ్లజనకాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. పైగా సోయాబీన్ కొలెస్ట్రాల్ రహితం. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది, అధికం ఫైబర్, ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ ఆహారంలో సోయాబీన్‌లను చేర్చుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపర్చడంతో పాటు మధుమేహ నిర్వహణలో కూడా సాయం చేస్తుంది. సోయాబీన్ అనేది సూపర్ ఫుడ్‌గా ఉండడంతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మంచిది.
అయితే సోయా ఎంత మంచిదైనా దాన్ని ఆహారంగా ఎలా తీసుకోవాలి? అంటూ కొంతమంది తికమకపడుతుంటారు. అలాంటి వారు మనం డైలీ చేసుకునే టిఫిన్స్ రూపంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించే విధంగా సోయాను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే అందరూ ఇష్టంగా ఇడ్లీ మిక్స్‌ను సోయాతో చేసుకుంటే మంచి బలవర్థకమైన ఆహారాన్ని శరీరానికి అందించవచ్చు. సోయా పొడితో చాలా ఈజీగా ఇడ్లీ చేసుకోవచ్చు. సోయా ఇడ్లీ రెసిపీ ఇప్పుడు తెలుసుకుందాం

Also Read : రేకుర్తి గుట్టపై మంత్రి గంగుల‌ పూజలు

.
తయారీకి కావాల్సిన పదార్థాలు
సోయా పొడి – 1 కప్పు
బియ్యం – రెండు కప్పులు
ఉప్పు- రుచికి తగనింత
పెసరపప్పు- అరకప్పు
నూనె – ఓ టేబుల్ స్పూన్
సోయా ఇడ్లీ తయారీ విధానం
సోయా పిండి, బియాన్ని రెండు వేర్వేరు గిన్నెల్లో నానబెట్టాలి.
తర్వాత అరకప్పు పెసరపప్పును తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టాలి.
తర్వాత బియాన్ని మెత్తగా మిక్సీలో వేసుకుని రుబ్బుకోవాలి. తర్వాత సోయాను, పెసరపప్పును కూడా ఇదే విధానం మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని ఈ మూడింటిని కలపాలి. అనంతరం రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకోవాలి.
అనంతరం ఈ మిశ్రమాన్ని 5-6 గంటల పాటు పక్కన పెట్టాలి. అనంతరం దాన్ని మెత్తగా మెదపాలి.
ఇప్పుడు ఇడ్లీ మౌడ్ తీసుకుని దానికి నూనె రాసి ఇడ్లీలను వేసుకుని, ఇడ్లీ పాత్రలో ఉడికించాలి.
అనంతరం ఉడికిన ఇడ్లీలను సాంబార్ లేదా చట్నీతో సెర్వ్ చేసుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube