బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

0
TMedia (Telugu News) :

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

– నారా లోకేష్

టీ మీడియా, డిసెంబర్ 29, మంగళగిరి : రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బిసి పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… ”జయహో బిసి కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటాం. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటు చేసి బిసి సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం. యువగళం పాదయాత్రలో బిసి సోదరులు పడుతున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నాను, నేను తిరగని మండలాల్లో కూడా జయహో బిసి ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంద”ని అన్నారు. రాష్ట్రంలో అనేకమంది ఉద్యోగులు తమ డిమాండ్లపై రోడ్డెక్కుతున్నారన్నారు. అంగన్ వాడీ, విద్యుత్, ఎస్ఎస్ఎ, ఆరోగ్య శ్రీ ఉద్యోగులు… ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

Also Read : రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు బర్రెలక్క

వైసిపి ప్రభుత్వం దివాలా తీసిందని, డబ్బుల్లేవని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తమ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక అనేకమంది బిసిలను అత్యంత అమానవీయంగా చంపేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ ను 10శాతం తగ్గించి, బిసిలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేశారని విమర్శించారు. కార్పొరేషన్లకు నిధుల్లేకుండా చేశారని పేర్కొన్నారు. ఓడిపోయే సీట్లన్నీ బిసిలకు ఇస్తున్నారని ఆరోపించారు. రొటీన్ గా ఇచ్చే పెన్షన్లు, అరకొర ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube