వర్సిటీ ఛాన్సలర్‌గా తొలగించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌

వర్సిటీ ఛాన్సలర్‌గా తొలగించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌

1
TMedia (Telugu News) :

వర్సిటీ ఛాన్సలర్‌గా తొలగించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌

టీ మీడియా,నవంబర్ 9, తిరువనంతపురం: కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ఆయనను యూనివర్సిటీ ఛాన్సలర్‌ పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : ఎంపీ నామ పరామర్శలు

కాగా, కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌, ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ ఆదేశాన్ని సవాల్‌ చేశారు.ఈ నేపథ్యంలో వర్సిటీ ఛాన్సలర్‌ పదవి నుంచి ఆయనను తప్పించేందుకు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ దీనిపై సంతకం చేస్తేనే అది అమలులోకి వస్తుంది.

ప్రకటన : 

 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube