పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ‌

పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ‌

1
TMedia (Telugu News) :

పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ‌

టీ మీడియా,సెప్టెంబర్ 8, తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, ప‌విత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

Also Read : సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్

ప‌విత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 8 న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భ‌క్తులు ఒక్కొక్కరు రూ.750/- చెల్లించి ఒక‌రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీర బ్రహ్మం ఆల‌య డిప్యూటీ ఈఓ లోకనాథం, ఏఈఓ ప్రభాక‌ర్‌రెడ్డి, అగ‌మ స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దామోద‌రం త‌దిత‌రులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube