జారే గెలుపు కొరకు ప్రత్యేక పూజలు

జారే గెలుపు కొరకు ప్రత్యేక పూజలు

0
TMedia (Telugu News) :

జారే గెలుపు కొరకు ప్రత్యేక పూజలు

టీ మీడియా, నవంబర్ 27, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ గెలుపును ఆకాంక్షిస్తూ దమ్మపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉలవల రాంబాబు దమ్మపేట పట్టణంలోని స్థానిక జీడిగింజల సెంటర్ నందు గల నాగేంద్ర స్వామి గుడిలో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉలవల రాంబాబు మాట్లాడుతూ జారే అన్న గెలుపు అనంతరం తాను నడుచుకుంటూ చిన్న తిరుపతి వెళ్లి మొక్కు ఇచ్చి వస్తానని దేవుడికి మొక్కుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచి విచ్చేసిన వేలాది భక్తులకు ఇందిరమ్మ ఆరు హామీలను తెలియజేస్తూ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకొస్తే ప్రజలకు కలుగు మేలును వివరించారు. హస్తం గుర్తుకే ఓటు వేసి జారే ను అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : రైతు బంధును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న‌ది

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube