శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు

శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు

1
TMedia (Telugu News) :

శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు

టి మీడియా,ఆగస్టు5,ఏర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకొని మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన మరియు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . దేవస్థానం తరపున అందరికీ పూజా సామాగ్రి, శేష వస్త్రము, మరియు ప్రసాదములు ఉచితంగా అందించడం జరిగింది.

 

Also Read : ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ధర్నా

 

ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రాజీవ్ శర్మ మరియు వేద పండితులు విజయ్ కృష్ణ మరియు అనంత యనచార్యులు గార్లు నిర్వహించారు . తదుపరి భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం జరిపినాము. లోకకళ్యాణార్థం మరియు సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ శ్రీ B. శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొని జయప్రదం చేసినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube