తిరుపతికి మరిన్ని ప్రత్యేక -రైళ్లు.. ఇవీ రూట్లు.

తిరుపతికి మరిన్ని ప్రత్యేక -రైళ్లు.. ఇవీ రూట్లు.

1
TMedia (Telugu News) :

తిరుపతికి మరిన్ని ప్రత్యేక -రైళ్లు.. ఇవీ రూట్లు.
టి మీడియా, జులై8,సికింద్రాబాద్:
తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఎప్పటిమాదిరిగానే కొనసాగుతుంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది.

రైలు నంబర్ 07297 కాచిగూడ నుంచి తిరుపతికి జూలై 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07298 తిరుపతి నుంచి కాచిగూడకు జూలై 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుతుంది. దారిలో రేణిగుంట, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ఢోన్, కర్నూల్ సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్ రైల్వే స్టేషన్‌లో ఈ రైలు ఆగుతుంది.

 

Also Read : మూడు లక్షల పథకం ఎప్పుడు

రైలు నంబర్ 07569 హైదరాబాద్ నుంచి తిరుపతికి జూలై 8న ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలు దారిలో సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. రైలు నంబర్ 07570 తిరుపతి నుంచి హైదరాబాద్‌కు జూలై 9న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం రాత్రి 9 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు దారిలో రేణిగుంట, గూడూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube