300 ఏళ్ల నాటి మర్రి చెట్టుకు భక్తుల ప్రత్యేక పూజలు
300 ఏళ్ల నాటి మర్రి చెట్టుకు భక్తుల ప్రత్యేక పూజలు
300 ఏళ్ల నాటి మర్రి చెట్టుకు భక్తుల ప్రత్యేక పూజలు..
లహరి, పిబ్రవరి 23, బెంగుళూరు : ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు, ఇరవై కాదు, వంద కాదు.. 3 వందల ఏళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు ప్రజల నుంచి భక్తి శ్రద్దలతో పూజలను అందుకుంటుంది. ఈ మర్రి చెట్టు ఎంత ప్రసిద్ధి చెందిందంటే.. మారు మూల గ్రామాల నుంచి జనం వస్తారు. జాత్రే మారులో మర్రి చెట్టు కు ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. బెంగుళూరు రూరల్ జిల్లా హోస్కోటే లోని కంబలిపురా ఔటర్ జోన్ అడవిలో మూడు వందల ఏళ్లనాటి చరిత్ర గల మర్రి చెట్టు ఉంది.చాలా సంవత్సరాలుగా, గ్రామస్తులందరూ ఇక్కడకు వచ్చి పూజలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున ఈ చెట్టుకు విశేష శక్తి లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం.శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజున వేలాది మంది చెట్టు వద్దకు వచ్చి పూజలను చేస్తారు. కొబ్బరికాయను మర్రి చెట్టుకు కట్టి 108 ప్రదక్షిణలు చేస్తారు. కష్టాలు తీర్చి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వలని కోరుకుంటూ పూజలు చేశారు. ఇలా అర్థరాత్రి వరకు భక్తుల పూజలు కొనసాగుతూనే ఉంటాయి 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ భారీ మర్రిచెట్టులో గ్రామ దేవత కాటేరమ్మ కొలువై ఉంటుందని గ్రామస్థుల విశ్వాసం.
Also Read : మత్స్య అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన యాదగిరీశుడు
శివరాత్రి తర్వాత వచ్చే తొలి అమావాస్య రోజున ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ రోజు చెట్టుకు పూజలు చేశారు. అంతేకాకుండా అడవిలో అమావాస్యను పురస్కరించుకుని అదే అటవీ ప్రాంతంలోని ఆలయం ముందు రాత్రి ప్రత్యంగిరా హోమం నిర్వహించి భోజనం చేశారు.తంత్రజ్ఞానం కొనసాగే అమావాస్య నాడు చెట్టుకు పూజలు చేస్తే మంచిదని ప్రజల నమ్మకం. అందుకనే.. మర్రి చెట్టు మొదల్లో పూజలు చేస్తారు. మూడు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ భారీ మర్రిచెట్టులో గ్రామ దేవత కాటేరమ్మ కొలువై ఉంటుందని ఇప్పటికీ నమ్ముతారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube