స్కాలర్ షిప్ ల ఆన్ లైన్ వేగవంతం చేయాలి
టీ మీడియా, మార్చి 11, రాజన్న సిరిసిల్లా:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఎస్సీ విద్యార్థులకు సంబంధించి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల అన్ లైన్ ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు సంబంధించి 3 వేల 968 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 3 వేల 145 మంది విద్యార్థుల నుండి దరఖాస్తులు వచ్చాయని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు సంబంధించి 2 వేల 170 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 1 వేల 563 మంది బయో మెట్రిక్ పూర్తయిందని అన్నారు. మిగిలిన విద్యార్థులకు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆయన ఆదేశించారు.
Also Read : ఐజేయు జిల్లా అద్యక్షనుకిసన్మానం
మండలాల పరిధిలో ప్రజలకు వివిధ రకాల ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడంలో జాప్యం చేయకూడదని తహశీల్దార్లకు కలెక్టర్ సూచించారు. ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో గంగయ్య, పర్యవేక్షకులు రవికాంత్, శ్రీకాంత్, సుజాత, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube