పి ఆర్ పనుల్లో వేగం పెరగాలి

కలెక్టర్ విపి గౌతం

1
TMedia (Telugu News) :

పి ఆర్ పనుల్లో వేగం పెరగాలి
– -కలెక్టర్ విపి గౌతం

టి మీడియా, జులై29,ఖమ్మం:
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగంచే చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పీఆర్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ గ్రాంట్ల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సిఎస్ఆర్ గ్రాంట్ క్రింద జిల్లాలో 276 పనులు చేపట్టగా, 247 పనులు పూర్తయినట్లు, 7 ప్రగతిలో ఉండగా, 33 పనులు ఇంకనూ ప్రారంభం కానట్లు తెలిపారు. సిడిపి గ్రాంట్ క్రింద 772 పనులు చేపట్టి, 614 పనులు పూర్తి కాగా, 28 పనులు ప్రగతిలో, 130 పనులు ఇంకనూ ప్రారంభించలేదని ఆయన అన్నారు. డిఎంఎఫ్ట్ క్రింద 421 పనులకు గాను, 394 పూర్తి కాగా, 6 ప్రగతిలో ఉండగా, 21 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.

 

Also Read : బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

 

ఎస్టిఎఫ్ క్రింద 2509 పనులకుగాను 2192 పూర్తయినట్లు, 66 పనులు ప్రగతిలో, 251 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీఎంజిఎస్పై, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎంపీ లాడ్స్ తదితర గ్రాంట్ల క్రింద మంజూరయిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రగతిలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, పురోగతిపై రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఇంకనూ ప్రారంభించని పనుల విషయంలో చర్యలు వేగం చేయాలన్నారు.ఈసమావేశంలో పంచాయతీరాజ్ ఎ జె. సుదర్శన్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, ఖమ్మం సత్తుపల్లి పిఆర్ ఇఇలు కె. శ్రీనివాస్, చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, పిఆర్ డికాలు శివగణేష్, వెంకటరెడ్డి, చంద్రు, కో

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube