చేతిపై భద్రయోగముంటే..

చేతిపై భద్రయోగముంటే..

0
TMedia (Telugu News) :

చేతిపై భద్రయోగముంటే..

లహరి, ఫిబ్రవరి 7, ఆధ్యాత్మికం : హస్తరేఖా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి చేతిపై రేఖలు, వివిధ ఆకృతులు, గుర్తుల ఆధారంగా ఆ వ్యక్తి భవష్యత్, స్వభావం, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఈ రేఖల ఆధారంగానే ఆ వ్యక్తి ఆదాయం, వ్యాపారం, కెరీర్ ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది చేతిలో ఉండే భద్ర యోగం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేతిలో భద్రయోగముంటే..ఆ వ్యక్తి జీవితంలో అంతులేని డబ్బులు, పేరు సంపాదిస్తారు.

చేతిపై భద్రయోగం ఉన్నవాళ్లు సమాజంలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారు. జీవితంలో అంతులేని సంపద, గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. చేతిలో భద్రయోగం ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. హస్తరేఖా శాస్త్రం ప్రకారం వ్యక్తి చేతిలో బుధపర్వం పూర్తిగా ఏర్పడి ఉంటుంది. దాంతోపాటు బుధ రేఖ తిన్నగా సన్నగా, లోతుగా ఉంటుంది. ఆ వ్యక్తి చేతిలో భద్రయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చేతిలో శశి యోగం ఉన్నవాళ్లు మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు. వీరి వ్యాపారం బుధగ్రహంతో సంబంధమై ఉంటుంది. ఈ వ్యక్తులు వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. స్వభావరీత్యా సాహసికులు, భయం లేనివాళ్లు. వీరి ముందు ప్రత్యర్ధులు నిలువలేరు. ప్రత్యర్ధుల్ని మిత్రులుగా మార్చుకోవడంలో సిద్ధహస్తులు.

Also Read : ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ ద్వారా కేటాయింపు..

హస్తరేఖా శాస్త్రం ప్రకారం ఒకవేళ బుధ పర్వతంపై చేప ఆకారంలో గుర్తు ఉంటే అలాంటి వ్యక్తి వ్యాపారంలో భారీ విజయాలు సాధిస్తాడు. అంతేకాదు..ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్తగా మారుతాడు. లక్ష్మీదేవి కటాక్షం ఇటువంటి వ్యక్తులపై సదా ఉంటుంది. వీరి వ్యాపారంలో తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. లగ్జరీ జీవితం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. పిసినారితనం అస్సలుండదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube