మహాశివరాత్రి వేళ శివయ్యను ఈ పువ్వులతో పూజిస్తే..

మహాశివరాత్రి వేళ శివయ్యను ఈ పువ్వులతో పూజిస్తే..

0
TMedia (Telugu News) :

మహాశివరాత్రి వేళ శివయ్యను ఈ పువ్వులతో పూజిస్తే..

లహరి, ఫిబ్రవరి9,అద్యాత్మికం : హిందూ పంచాంగం ప్రకారం, ఈ నెల 18వ తేదీన అంటే శనివారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ప్రపంచంలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం మల్లన్న, విజయవాడలో దుర్గామల్లేశ్వరస్వామి, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి పర్వదినాన ఎలాంటి మంత్రాలు తెలియకపోయినా, కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై కొంచెం నీళ్లు పోసినా శివయ్య సంతోషిస్తాడని పురాణాలలో ప్రస్తావించబడింది. ఇదిలా ఉండగా.. శివపురాణం ప్రకారం, మహాశివరాత్రి రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ఏ పువ్వును సమర్పిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఎరుపు రంగు పువ్వులు..
శివ పురాణం ప్రకారం, ఎరుపు రంగులో ఉండే పువ్వులను మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి సమర్పించడం వల్ల శివుని ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయి. ఎందుకంటే ఈశ్వరుడికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం. వీటితో పాటు తెలుపు రంగులో ఉండే బొమ్మలతో శివయ్యను పూజిస్తే శివ లోకాన్ని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

Also Read : ముల్లంగి తీసుకుంటే కలిగే లాభాలేమిటో తెలుసా..?

మల్లెపువ్వులతో..
పరమేశ్వరుడికి మల్లెపువ్వులంటే చాలా ప్రీతికరం. శాస్త్రాల ప్రకారం, మహాశివరాత్రి రోజున మల్లెపువ్వులను ఈశ్వరుడికి సమర్పించడం వల్ల మానవ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ధాన్యాల కొరత అనేది ఎప్పటికీ ఉండదు. మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి.

ధాతుర పువ్వులు..
మహాశివరాత్రి వేళ ధాతుర పువ్వులు, ఫలాలు లేకుండా శివుని ఆరాధన చేస్తే అది అసంపూర్ణంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ పండుగ వేళ కచ్చితంగా స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. వీటిని సమర్పించిన వివాహితులకు సంతాన సౌభాగ్యం నెరవేరుతుందని పండితులు చెబుతారు.

శమీ పువ్వులు..

ఈసారి మహాశివరాత్రి శనివారం రోజున వచ్చింది కాబట్టి ఆ కైలాసనాథుడికి శమీ పుష్పాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే బేలపువ్వులతో పూజించడం వల్ల కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read : ఈ ఆరోగ్య సమస్యలున్నవారు టమోటా తినకూడదు..!

బిల్వ పత్రాలతో పాటు ఈ పువ్వులతో..
మహాశివరాత్రి రోజున శివలింగంపై 108 బిల్వపత్రాలను సమర్పించడం వల్ల వ్యాపారులకు నష్టమనేదే ఉండదు. వీటితో పాటు మునగ పువ్వును సమర్పించడం వల్ల సర్వపాపాల నుంచి విముక్తి లభిస్తుంది. జుహీ పువ్వులను సమర్పించడం వల్ల పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహంతో పాటు విశేష ప్రయోజనాలు కలుగుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube