ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలున్నాయన్న సంగతి తెలుసా..

ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలున్నాయన్న సంగతి తెలుసా..

0
TMedia (Telugu News) :

ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలున్నాయన్న సంగతి తెలుసా..

లహరి, ఫిబ్రవరి 11, ఆధ్యాత్మికం : శివభక్తులు ప్రతిరోజు శివుని పూజిస్తారు. అయినప్పటికీ నెలనెలా వచ్చే మాస శివరాత్రికి.. మాఘమాసంలో వచ్చే మహా శివరాత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలో.. అత్యంత సులభంగా ప్రసన్నుడయ్యే దైవంగా శివుడు కీర్తించబడుతున్నాడు. నిర్మలమైన హృదయంతో జలం, బిల్వ పత్రం సమర్పిస్తే చాలు కొలిచిన భక్తుల కోర్కిలు తీర్చే భోళాశంకరుడు. అయితే శివుని పూజకు మాత్రమే కాదు.. శివాలయంలో చేసే ప్రదక్షిణకు కూడా కొన్ని నియమాలున్నాయి. శివాలయంలో చేసే ప్రదక్షిణ చేసే విధానం శివ పురాణంలో పేర్కొన్నారు. అయితే శివలింగానికి ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలను తెలుసుకుందాం. హిందూమతంలో ఏదైనా దేవతను పూజించిన తర్వాత లేదా ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన అంతరం ఖచ్చితంగా ప్రదక్షిణ చేస్తారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది. ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇతర దేవాలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణ ఈశ్వరుని ఆలయంలో ప్రదక్షిణ చేయకూడదు.. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు.
శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. చండి ప్రదక్షిణ అంటే ఏమిటి ఈ ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు.

Also Read : ఈ అలవాట్ల వల్ల మహిళలు ఇబ్బందుల్లో పడతారు

శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లి.. అక్కడ చండీశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోవాలి. అనంతరం ధ్వజస్తంభం ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం వెళ్లే దారి వరకూ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లవుంటుంది. ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటి వెళ్ళకూడదు. సోమసూత్రం నుంచి ఆలయంలో చేసిన అభిషేకం జలం బయటకు వెళ్తుంది. అంతేకాదు అక్కడ శివ ప్రమధగణాలు ఉంటారని విశ్వాసం. ఈ జలం దాటి చేసే ప్రదక్షిణ ఫలితం ఇవ్వదని పురాణాలు పేర్కొన్నాయి. చండి ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే.. పదివేల ప్రదక్షణాలుతో సమానమని లింగా పురాణంలో పేర్కొన్నారు. మూడు ప్రదక్షణాలు చేయాలి. తెలిసి తెలియక శివాలయంలో శివయ్యకు, నందికి మధ్య నడవకూడదు. నందీశ్వరుడు శివయ్యను చూస్తూనే ఉంటాడు. కనుక ఆయన దృష్టికి ఎవరూ అడ్డు వెళ్ళరాదు. నందీశ్వరుడి వెనుక నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు.. విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక దైవాన్ని ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube