మహా శివరాత్రి వేళ జాగరణ, ఉపవాస వ్రతం ఎందుకు ఆచరిస్తారు…
మహా శివరాత్రి వేళ జాగరణ, ఉపవాస వ్రతం ఎందుకు ఆచరిస్తారు...
మహా శివరాత్రి వేళ జాగరణ, ఉపవాస వ్రతం ఎందుకు ఆచరిస్తారు…
లహరి, ఫిబ్రవరి 14, ఆధ్యాత్మికం : హిందూ పురాణాల ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో క్రిష్ణ పక్షంలో చతుర్దశి తిథి రోజున మహా శివరాత్రి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ శివయ్య దివ్యమైన అవతారానికి సంబంధించిన పవిత్రమైన పండుగ. నిరాకరం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహా శివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం నాడు వచ్చింది. ఇదే రోజున శని త్రయోదశి రావడం విశేషం. ఇదిలా ఉండగా.. మహాశివరాత్రి రోజున ఎందుకని మేల్కొనే ఉండాలి.. ప్రతి ఒక్కరూ జాగరణ(నిద్ర పోకుండా) ఎందుకుంటారు.. ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు.. మహా శివరాత్రి రోజున శివుని పూజా విధానం.. ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఫిబ్రవరి 14 వరకు అమెజాన్ వాలెంటైన్స్ డే స్పెషల్ | వాలెంటైన్స్ డే గిఫ్ట్‌లపై గొప్ప తగ్గింపు ధరలు
మాఘ మాసంలో..
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రతి నెలలో శివరాత్రి సాధారణంగా వస్తుంది. అయితే మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం మహా శివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజు పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడింది. హిందూ పురాణాల ప్రకారం, ఇదే రోజు శివపార్వతుల కలయిక జరిగింది. అందుకే ఈ రాత్రిని మహా శివరాత్రిగా భావిస్తారు. అలాగే లింగోద్భవం కూడా జరిగింది ఈ రోజునే.
Also Read : బీబీసీపై ఐటీ దాడి.. అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్
జాగరణ ఎందుకంటే..
మహా శివరాత్రి రోజున ఎందుకని తప్పనిసరిగా జాగరణ(నిద్ర పోకుండా) ఉండాలనే ప్రశ్నలకు పండితులు ఇలా సమాధానం చెప్పారు. మహా శివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి, శివభక్తులు మహా శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందాలి. ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈరోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచినవారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు. అందుకే వీరంతా వెన్నెముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు.
.
జాగరణ వేళ ధ్యానం..
మహా శివరాత్రి రోజున రాత్రి వేళలో మేల్కొని, మీ వెన్నెముకను నిటారుగా ఉంచి, ధ్యానం చేయడం వల్ల, యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అందుకే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బాబా మహా శివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేస్తారు. మహా శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల కామం, క్రోధం నుంచి శివుడు రక్షిస్తాడు. అంతేకాదు అసూయ, చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.
పగలంతా నియమ నిష్ఠలతో..
పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా.. తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమనీ.. ఆ ఒక్క రోజు తనకు ఉపవాసంతో ఉండి, జాగరణ(నిద్రపోకుండా) ఉంటే చాలని చెబుతాడు. అదే విధంగా ఈరోజున పగలంతా ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనేతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు.
Also Read : మహిళలను ఢీకొట్టిన వాహనం.. ఐదుగురు మృతి
మోక్షం దక్కుతుంది..!
గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ ఒక్కరోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు.. ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు.