మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం..

మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం..

0
TMedia (Telugu News) :

మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం..

లహరి, ఫిబ్రవరి 14, ఆధ్యాత్మికం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కాలానుగుణంగా గ్రహాల గమనంలో మార్పు వస్తుంది. ప్రేమ, సంపదను ఇచ్చే శుక్రుడు ఈరోజు అంటే ఫిబ్రవరి 15న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా అరుదుగా కలిగే మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పలురాశులకు ఎంతో శుభకరమైనదిగా భావిస్తారు. మరి ఈ యోగం వల్ల ఏయే రాశులవారి భవిష్యత్తు, విధిరాత మారనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మాలవ్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం

మిథునం: మాలవ్య రాజయోగం ఈ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం ఈ రాశివారి కర్మ స్థానంలో మాలవ్య రాజ్యయోగం ఏర్పడేలా చేస్తుంది. ఇదే సమయంలో గురుడు హన్స్ అనే రాజయోగాన్ని కూడా ఏర్పరుస్తున్నాడు. దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ వద్దకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పని లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లే అవకాశం ఉంది.

కన్య రాశిచక్రం: మాలవ్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. అంతేకాకుండా హన్స్ అనే రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. మెగుడుపెళ్లాల మధ్య బంధం గట్టిపడుతుంది. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లికాని వివాహం కుదిరే అవకాశం ఉంది.

Also Read : శరీర బరువును, బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోండి.

 

వృషభ రాశి: శుక్రుని సంచారం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలో ఇప్పటికే బృహస్పతి ఉన్న ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు.

ధనుస్సు రాశి: మాలవ్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ సంచార జాతకంలో నాల్గో పాదంలో ఏర్పడుతుంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ఈ సమయంలో లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాలిటిక్స్‌లో ఉన్నవారికి మంచి పదవి దక్కుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube