ఏ సమయంలో శివయ్యను పూజిస్తే అదృష్టం లభిస్తుందో తెలుసా.

ఏ సమయంలో శివయ్యను పూజిస్తే అదృష్టం లభిస్తుందో తెలుసా.

0
TMedia (Telugu News) :

ఏ సమయంలో శివయ్యను పూజిస్తే అదృష్టం లభిస్తుందో తెలుసా…

లహరి, ఫిబ్రవరి 16, ఆధ్యాత్మికం : మహా శివరాత్రి పండుగను ఫిబ్రవరి 18వ తేదీన శనివారం నాడు జరుపుకుంటారు. అయితే చతుర్దశి తిథి ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 8:02 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీన ముగుస్తుంది. పంచాంగం ప్రకారం, ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 18న శనివారం నాడు మహా శివరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు. మహా శివరాత్రి రోజున శివయ్యను నాలుగు దశల్లో పూజించాలని హిందూ మత గ్రంథాల్లో పేర్కొనబడింది.
తొలి ప్రహార పూజా సమయం : 18 ఫిబ్రవరి 2023 సాయంత్రం 6:45 గంటల నుంచి 9:35 గంటల వరకు
రెండో ప్రహార పూజా సమయం : 18 ఫిబ్రవరి 2023 రాత్రి 9:35 గంటల నుంచి రాత్రి 12:24 గంటల వరకు
మూడో ప్రహార పూజా సమయం : 19 ఫిబ్రవరి 2023 అర్ధరాత్రి 12:24 గంటల నుంచి తెల్లవారుజామున 3:14 గంటల వరకు
నాలుగో ప్రహార పూజా సమయం 19 ఫిబ్రవరి 2023 తెల్లవారుజామున 3:14 గంటల నుంచి ఉదయం 6:01 గంటల వరకు

Also Read : చొరబాటుకు యత్నించిన పాక్‌ ఉగ్రవాది హతం

మహా శివరాత్రి పండుగ రోజున సర్వార్ధ సిద్ధి యోగం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
శని ప్రదోష వ్రతం 18 ఫిబ్రవరి 2023 శనివారం రాత్రి గంటలకు ఉంటుంది.

పూజా విధానం..

– మహా శివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించి, ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి.

– ఉదయాన్నే మీకు దగ్గర్లో ఉండే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.

– శివ లింగానికి ఆవు పాలు, నెయ్యి, తేనే లేదా చెరకు రసంతో అభిషేకం చేయాలి.

– శివయ్యకు బిల్వ పత్రాలు, దతురా పువ్వులు, పండ్లు, తాంబూలం వంటివి సమర్పించి, శివ చాలీసా పఠించాలి.

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం..

Also Read : మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని..

మహా శివరాత్రి పండుగ రోజునే పరమేశ్వరుని పన్నెండు(ద్వాదశ) జ్యోతిర్లింగాలు దర్శనమిచ్చినట్లు మత గ్రంథాలలో పేర్కొనబడింది. అవి సోమనాథ్ జ్యోతిర్లింగం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, కేదరానాథ్ జ్యోతిర్లింగం, శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం, శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. మహా శివరాత్రి వేళ ఈ శైవ క్షేత్రాల్లో విశేష పూజలు జరుగుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube