ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..

ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..

0
TMedia (Telugu News) :

ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..

లహరి, ఫిబ్రవరి 17, ఆధ్యాత్మికం : జీవితంలో అంతా సజావుగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.. అయితే అకస్మాత్తుగా కష్టాలు, నష్టాలు ఒక్కసారే చుట్టుముట్టడం మొదలవుతాయి. కష్టాల కడలిలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరగడం, ధన నష్టం జరగడం మొదలవుతుంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారలో నష్టాలు, అభివృద్ధి ఆగిపోవడం తో పాటు.. కుటుంబంలో ఇబ్బందులు .. వ్యాధులు వంటివి ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే.. ఇలాంటి సంఘటనలు జరగడానికి ముందే.. ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ సంకేతాలు మీకు లేదా మీ కుటుంబంలో చెడు జరగబోతోందని సూచిస్తుంటాయి. ఏవి ఏమిటో తెలుసుకుందాం..

తులసి మొక్క ఆకస్మాత్తుగా ఎండిపోవడం.. హిందూ మతంలో తులసి మొక్కకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి.. పవిత్రమైనది. లక్ష్మీ దేవి రూపంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కని నిత్యం పూజిస్తారు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాల తమ కుటుంబం సాగిపోవాలని కోరుకుంటారు. అయితే తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోసిన తర్వాత కూడా అది ఎండిపోతే… మీకు ఏదైనా చెడు జరగబోతోందనేదానికి సంకేతం. ఆరోగ్యం, సంపద , గౌరవం దెబ్బతినడం ప్రారంభమవుతుందనడానికి సూచన.

Also Read : శివరాత్రి వేళ భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త

పగిలిన గాజు.. వాస్తు శాస్త్రంలో.. గాజు, గాజు వస్తువులు, అద్దం పగలడం చాలా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే ఇంట్లోని అద్దాలు పదే పదే పగలడం ప్రారంభిస్తాయో.. అప్పుడు మీకు కొన్ని విపత్తులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి. ఇంట్లో అద్దం పగలడం చాలా అశుభం. ఈ కారణంగా ఇంట్లో కలహాలు మొదలవుతాయి.
బంగారం పోగొట్టుకుంటే బంగారం కోల్పోవడం చాలా అశుభ సంకేతం. ఇళ్లలోని బంగారం అకస్మాత్తుగా పోయినట్లయితే.. అది ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడాన్ని సూచిస్తుంది.

పిల్లి ఏడుపు.. పురాణల ప్రకారం పిల్లి ఏడుపు చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి చుట్టూ పిల్లి ఏడుస్తూ తిరిగితే.. ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లోపిస్తుంది. ఏదైనా భయంకరమైన సంఘటన జరుగుతుందని ఒకవిధమైన నమ్మకం. ఇది మాత్రమే కాదు ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో పిల్లి ఎదురైనా.. రోడ్డు దాటున్నా అశుభంగా పరిగణించబడుతుంది.

ఇంటి చుట్టూ గబ్బిలాలు కనిపిస్తే.. అకస్మాత్తుగా గబ్బిలాలు మీ ఇంటి చుట్టూ తిరగడం ప్రారంభించినప్పుడు, అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. గబ్బిలాలు కొట్టుకోవడం ఒక వ్యక్తి జీవితంలో కష్టాల ప్రారంభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతాలను కనిపిస్తే.. ఆ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read : సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్

హఠాత్తుగా దీపం ఆరిపోతే.. పూజ చేస్తున్న సమయంలో దీపం ఆరిపోయినట్లయితే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేడు జరగబోతుంది అన్న విషయానికి ఇది సంకేతంగా పరిగణించబడుతుంది. దేవతల అసంతృప్తిని సూచిస్తుంది. ఇంట్లో పేదరికం ప్రభావం పెరుగుతుంది. జీవితంలో భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.

ఆకస్మిక ధన నష్టం.. అకస్మాత్తుగా డబ్బు ఇబ్బందులు పెరిగినప్పుడు.. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరగడం ప్రారంభిస్తే, అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది లక్ష్మీదేవి ఆ ఇంటి వ్యక్తులపై ఆగ్రహం కలిసి ఉందనడానికి సంకేతం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube