ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా..

ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా..

0
TMedia (Telugu News) :

ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా..

లహరి, ఫిబ్రవరి 18, ఆధ్యాత్మికం : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడు విశ్వంలో శివలింగ రూపంలో ఉద్భవించాడని.. శివ పార్వతిల వివాహం జరిగిన రోజు అని హిందువుల విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. బిల్వ పత్రం, గంగ జలం, వంటి వాటితో పూజను చేస్తారు. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, గంగాజలం, చెరకు రసంతో అభిషేకం చేస్తారు.
ఈ శివరాత్రి వెరీ వెరీ స్పెషల్.. ఈ సంవత్సరం, మహాశివరాత్రి నాడు చాలా అరుదైనది. 144 ఏళ్లకు మాత్రమే ఇలా వస్తుందని చెప్పడంతో.. ఈ ఏడాది మహాశివరాత్రి ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఈ రోజు కుంభరాశిలో శని, సూర్యుడు, చంద్రుడు కలవనున్నారు. దీంతో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. అంతేకాదు మహాశివరాత్రి రోజున శని త్రయోదశి కూడా వచ్చింది. కనుక ఈ ఏడాది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం చాలా ఫలవంతంగా పండితులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలను చేయడం ద్వారా.. అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతారు.
దోష నివారణ కోసం మహా శివరాత్రి చేయాల్సిన పూజలు…
భోళాశంకరుడు పూజించడం, మంత్రాలు పఠించడం, మహాశివరాత్రి రోజంతా ఉపవాసం ఉండడం వల్ల మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు ఆరాధన సమయంలో శివుడిని మారేడు, ఉమ్మెత్త, లను సమర్పిస్తారు. గంగా జలంతో అభిషేకం చేస్తారు. శివుడిని ఆరాధించడం ద్వారా.. ఒక వ్యక్తి తన జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుండి విముక్తి పొందుతాడు.

Also Read : కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే శుభ సమయం వచ్చేసింది

మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివపురాణం పఠించడం, మహామృత్యుంజయ మంత్రాలను పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
ఏలి నటి శని ప్రభావం ఉన్నవారు మహాశివరాత్రి రోజున శివునితో పాటు హనుమంతుడిని పూజించాలి.
మహాశివరాత్రి రోజున నీడ దానం చేయడం చాలా శ్రేయస్కరం.
హాశివరాత్రి రోజున శివుని జలాభిషేకాన్ని పాలు, పెరుగు, గంగాజలంతో చేయాలి.
హాశివరాత్రి రోజున రావి చెట్టును పూజించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube