ఈ కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

ఈ కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

0
TMedia (Telugu News) :

ఈ కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు

టీ మీడియా, ఫిబ్రవరి 23, ఆధ్యాత్మికం : నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. కలలకు కాళ్లుండవు అన్నట్టు..ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి. ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలాంటి కలలు వస్తుంటాయి. వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు. నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో అదే ఆలోచన కలరూపంలో వస్తుందని కూడా అంటారు. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం కల. అయితే వచ్చిన కల వచ్చినట్టు చెప్పేస్తుంటారు కొందరు. కానీ కొన్ని కలలు మాత్రం షేర్ చేసుకోరాదంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఈ ఐదు కలలను గోప్యంగా ఉంచితేనే ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

మీరు చనిపోయినట్టు కలవస్తే..
చాలామందికి వచ్చే కలల్లో…చనిపోనట్టు కల వస్తుంటుంది. మనం చనిపోయినట్టు మనకే కలరావడం, చనిపోయిన తర్వాత కూడా మనచుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. ఈ కల రాగానే చాలామంది భయపడుతుంటారు కానీ అది శుభసూచకమే అంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఇలాంటి కల మీ ఇంటికి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని…ఇది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ ఆనందం అందుకోలేరని చెబుతారు.
తల్లిదండ్రులకు సేవ చేసినట్టు కలవస్తే..
తల్లిదండ్రులకు ఇలలో సేవ చేస్తారో చేయరో కానీ చాలామంది కలలో మాత్రం చేస్తుంటారు. వింటే నవ్వొస్తుంది కానీ నిజమే వాస్తవానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వకపోయినా కలలో మాత్రం అన్ని సేవలు చేసినట్టు వస్తుంది. అయితే ఇలాంటి కల కూడా మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని చెబుతారు. ఈ కలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని..అలా పంచుకుంటే ప్రయోజం పొందలేరని అంటారు

వెండి కలశం, వెండి వస్తువులు కలలో కనిపిస్తే..
వెండితో నిండిన కలశం కలలో కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఈ కల లక్ష్మీఅనుగ్రహాన్ని సూచిస్తుంది.స్వప్న శాస్త్రం ప్రకారం, ఈ కలను ఎవరికైనా చెబితే లక్ష్మీ కటాక్షం కలగదు అంటారు

Also Read : శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే..

కలలో దేవుడి దర్శనం ..
కలలు వచ్చేవారికి ఎవరికైనా ఎప్పుడోఓసారి దేవుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా కానీ దేవుడు మాత్రం ఏదో సందర్భంలో కలలో తప్పనిసరిగా కనిపిస్తాడు. ఇలాంటి కలవస్తే కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోందని అర్థం. ఈ కల కూడా ఎవ్వరికీ చెప్పకూడదంటారు స్వప్న శాస్త్ర నిపుణులు

పండ్ల తోట కలలో కనిపిస్తే..
కలలో పండ్ల తోట కనిపించడం కూడా చాలా శుభసూచకం. సాధారణంగా గర్భిణిలకు కలలో పండ్ల తోట కనిపిస్తే అబ్బాయి, పూలతోట కనిపిస్తే అమ్మాయి పుడతారని చెప్పేందుకు సంకేతం అని అంటారు. అయితే పండ్లతోట కలలో కనిపిస్తే భవిష్యత్ లో రాబోయే ఆనందాన్ని సూచిస్తుందట. కలల శాస్త్రం ప్రకారం ఈ కలను కూడా ఎవ్వరితోనూ పంచుకోరాదట.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube