బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచుకుంటే?
టీ మీడియా, ఫిబ్రవరి 25, ఆధ్యాత్మికం : శివుని ఆరాధనలో బిల్వ పత్రాలకు కీలక పాత్ర వుంది. బిల్వ పత్రాలు త్రిశూలానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే మూడు శక్తులకు సంబంధించిన అంశంగా బిల్వం పూజించబడుతుంది.శ్రీ మహాలక్ష్మి సముద్రం నుండి ఉద్భవించినప్పుడు, ఆమె చేతుల నుండి బిల్వ పత్రాలు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ వృక్షం మహాలక్ష్మి నివాసం. బిల్వ వృక్షం కొమ్మలను వేదాలుగానూ, ఆకులను శివ స్వరూపంగానూ పూజిస్తారు. బిల్వపత్రాలతో పూజ పరమశివునికి మహా ఇష్టం. అందుకే శ్రద్ధతో వ్రతం ఆచరించి బిల్వ వృక్షాన్ని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. స్వామిని బిల్వ ఆకుతో పూజిస్తే లక్ష బంగారు పుష్పాలతో స్వామిని పూజించినట్లే.తులసి కోటలా ఇంట్లో బిల్వ చెట్లను పెంచుకునే వారికి నరకం ఉండదు. బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. బిల్వ పూజ వేయి మందికి అన్నదానం చేసిన ఫలితం ఇస్తుంది. పుణ్య నదులలో స్నానం చేసినంత మేలు జరుగుతుంది.
Also Read : ఉదయాన్నే ప్రోటీన్లతో నిండి ఉండే టిఫిన్
108 దేవాలయాలను దర్శించినంత పుణ్యం దక్కుతుంది. బిల్వం ఆకు, పువ్వు, వేరు, పండు, బెరడులలో ఔషధ గుణాలు ఉన్నాయి.బిల్వ పత్రాలతో పూజతో శివానుగ్రహం పొందవచ్చు. ఏలినాటి శనిదోషం ఉన్నవారు బిల్వార్చన చేయడం ఉత్తమం. బిల్వ పత్రాలను సోమవరం, చతుర్థి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో చెట్టు నుండి తీయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube