శని దేవుడికి ఆవాల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసా…
లహరి, ఫిబ్రవరి 28, ఆధ్యాత్మికం : మనలో ఎవరైతే శని దోషం ప్రభావం ఇబ్బంది పడుతుంటారో వారందరూ శనివారం రోజున శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అది కూడా శనీశ్వరుడికి ఇష్టమైన శనివారం రోజున ఆవాల నూనె సమర్పించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది విశ్వాసం. అయితే శని దేవుడికి ఆవాల నూనెను ఎందుకని సమర్పిస్తారు.. దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం… పురాణాల ప్రకారం, ఒకప్పుడు శని భగవానుడు తన బలం, శక్తుల గురించి ఎంతో గర్వపడ్డాడు. తన కంటే విశ్వంలో శక్తివంతమైన వారు ఎవ్వరు లేరనే గర్వంతో ఉండేవాడు. అయితే అదే సమయంలో హనుమంతుడి కీర్తి కూడా చాలా వ్యాపించింది. ఆంజనేయుడి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో శని దేవుడికి చాలా కోపం వచ్చింది. తన కంటే ఇంకా ఎవరు శక్తివంతంగా ఉండకూడదని భావించాడు. అందుకే ఆంజనేయుడితో ఘర్షణ పెట్టుకుని, తనకు సవాల్ విసిరాడు.స్వతహాగా శ్రీరామ భక్తుడైన హనుమంతుడు శని దేవుడు చేసిన సవాల్‌ను పట్టించుకోకుండా రాముని పూజలో మునిగిపోయాడు. తనతో గొడవలు పెట్టుకోవద్దని శని దేవునికి సూచించాడు. అయినా కూడా శని దేవుడు వినకపోవడంతో వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో, శని దేవుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో ఆంజనేయుడు యుద్ధానికి విరామం ప్రకటించి, శని దేవుడికి ఆవాల నూనె రాయడం ప్రారంభించాడు. ఈ కారణంగా శని దేవుడు ఉపశమనం పొందాడు. దీంతో శని దేవుడికి ఆవాల నూనె అంటే చాలా ఇష్టం ఏర్పడింది.
Also Read : ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి
అప్పటి నుంచి ఎవ్వరైనా శని దేవుడికి నైవేద్యంగా తైలాన్ని, ఆవాల నూనెను సమర్పిస్తే వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. ఈ యుద్ధం తర్వాత హనుమంతుడికి, శని దేవుడికి స్నేహ సంబంధాలు మెరుగయ్యాయి. అందుకే శనివారం రోజున ఏ భక్తులైనా ఆంజనేయుడిని, శని దేవుడిని పూజిస్తే ఎలాంటి సమస్యల నుంచైనా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. శని దేవుడిని న్యాయాధిపతిగా పిలుస్తారు. ఈ భగవంతుడు ప్రతి ఒక్కరి పనులకు సంబంధించి జాబితా తయారు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆవాల నూనెను శని దేవుడికి సమర్పిస్తారో వారికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. శనివారం రోజున ఆవాల నూనెను శని దేవుడికి సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. డబ్బుకు సంబంధించిన పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పించడం వల్ల శని దేవుని సాడే సతి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. శని మహా దశ ప్రభావం కూడా తగ్గుతుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube