నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు తెలుసా.?
లహరి, మార్చి 1, ఆధ్యాత్మికం : మనస్సులో కోర్కెలు నెరవేర్చుకునేందుకు పలు నమ్మకాల్ని పాటిస్తుంటారు. ఇందులో ఒకటి నదీ నదాల్లో ప్రవాహాల్లో కాయిన్స్, ఇతర వస్తువుల్ని వేయడం. నదిలో నాణేలు వేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది అనాదిగా వస్తున్న ఓ విశ్వాసం, ఓ నమ్మకం. ఇది ఎంతవరకూ నిజం..
నదీ నదాల్లో, సముద్రాల్లో, బావుల్లో సులభంగా చెప్పాలంటే నీళ్లలో నాణేలు వేయడం చాలాకాలంగా వస్తున్న ఓ అలవాటు లేదా ఓ నమ్మకం. అందుకే ముఖ్యంగా రైళ్లోంచి వెళ్లేటప్పుడు ఏదైనా నది దాటుతున్నక్రమంలో కిటికీలోంచి డబ్బులు విసిరి నదిలోకి వేస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా అయితే వంతెన దాటేటప్పుడు ఆపి మరీ రూపాయో, రెండు రూపాయలో, 5 రూపాయల నాణెమో వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయనేది ఓ ప్రధాన నమ్మకం. నదిలో నాణేలు వేయడం వల్ల నిజంగానా కోర్కెలు నెరవేరుతాయా, దీని వెనుక ఉన్న ఏదైనా మతలబు ఉందా అనేది తెలుసుకుందాం..
Also Read : తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ అమలు
నీళ్లలో నాణేలు..
నీళ్లలో ముఖ్యంగా నదుల్లో నాణేలు వేయడమనే అలవాటు అనాదిగా అంటే ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ప్రవహించే నీళ్లలో వస్తువులు లేదా నాణేలు వేయడం వల్ల మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం. ముఖ్యంగా హిందూమతంలో ఉన్న విశ్వాసం. నదిలో నాణేలు వేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయా లేదా అనేది ఒకరి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కొందరు దీనిని అంధ విశ్వాసంగా కొట్టిపారేస్తారు. మరికొందరు అర్ధం లేని చర్యగా అభివర్ణిస్తుంటారు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా దీని వెనుక మతలబు మాత్రం ఉందంటున్నారు ఇంకొందరు. వాస్తవానికి పాతకాలంలో రాగి లేదా ఇత్తడి వస్తువుల్ని నీళ్లలో ప్రవహింపజేసేవారు. ఒకప్పుడు రాగి నాణాలు చలామణిలో ఉండేవి. రాగి అనేది నీళ్లను శుభ్రపరుస్తుందంటారు. అందుకే పాతకాలంలో నాటి ప్రజలు ఎప్పుడు నది లేదా చెరువు లేదా బావుల వద్దకు వెళ్లినా..అందులో రాగి నాణేలు వేసేవారు. దీనివల్ల నీళ్లు శుభ్రమౌతాయని నమ్మకం.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube