ఎంత కష్టపడినా అపజయమే ఎదురవుతుందా?

వీటిని పాటిస్తే విజయం తథ్యం : చాణక్య

0
TMedia (Telugu News) :

ఎంత కష్టపడినా అపజయమే ఎదురవుతుందా?

-వీటిని పాటిస్తే విజయం తథ్యం : చాణక్య

లహరి, మార్చి2, ఆధ్యాత్మికం : కష్టే ఫలి అంటారు.. అంటే కష్టపడందే ఏదీ రాదని అర్థం. అయితే, చాలామంది కష్టపడి పని చేస్తుంటారు. అయినప్పటికీ వారు ఆశించిన విజయాన్ని పొందలేకపోతారు. ప్రతి ప్రయత్నంలో వైఫల్యాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా ఈజీగా సక్సెస్ సాధించొచ్చని అంటారు. మరి ఆ సలహాలు, సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. సింహం తన లక్ష్యాన్ని సాధించడానికి తన శక్తినంతా కూడగట్టుకుంటుంది. మనిషి కూడా ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. దానిపైనే ఫోకస్ చేసి, తన శక్తినంతా కూడగట్టుకోవాలి. తనను తాను ఆ లక్ష్య సాధనకు అంకితం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎంతటి లక్ష్యమయినా.. సులభంగా సాధించవచ్చు.

2. ఒక వ్యక్తి తన మనస్సును తన పనిపై దృష్టిపెట్టనప్పుడు మళ్లీ మళ్లీ ఓటమిపాలవ్వాల్సి వస్తుంది. అందుకే ముందుగా మీ లక్ష్యంపై మీరు ఫోకస్ పెట్టాలి. మనసును కేంద్రీకరించుకోవాలి. ఈ శక్తియుక్తులన్నింటినీ ఆ లక్ష్యం వైపు పెడితే.. విజయం మిమ్మల్నే వరిస్తుంది.

Also Read : లారీ బీభత్సం.. ముగ్గురు కూలీలు మృతి

3. సమయానికి విలువ ఇవ్వని, సమయాన్ని సద్వినియోగం చేసుకోని వారు జీవితంలో ఎప్పటికీ రాణించలేరు. విజయం సాధించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయానికి ప్రాముఖ్యతనివ్వడం చాలా ముఖ్యం. ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే.. సమయపాలన పాటిస్తూ, లక్ష్య సాధనపై గురిపెట్టుకోవాలి. ఆటోమాటిక్‌గా విజయం మిమ్మల్ని వరిస్తుంది.

4. నెగిటీవ్ వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. నెగిటివ్ వ్యక్తులు ఎప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ మాటలతో ప్రోత్సహించేవారికి చేరువవ్వాలి. అలాంటి వారితోనే స్నేహం కొనసాగించాలి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube