ఆదివారం ఈ పనులు పొరపాటున కూడా చేయకండి

ఆదివారం ఈ పనులు పొరపాటున కూడా చేయకండి

0
TMedia (Telugu News) :

ఆదివారం ఈ పనులు పొరపాటున కూడా చేయకండి

లహరి, మార్చి 4, ఆధ్యాత్మికం : గ్రహలలో సూర్యుడు అత్యంత శక్తిని కల్గి ఉంటాడు. మనలో చాలా మందికి ఆదివారం సెలవు దినంగా ఉంటుంది. దీంతో తమ వ్యక్తిగత పనులు చేసుకుంటుంటారు. ఇక మాములు రోజుల్లో చేయలేని పనులు కూడా ఆదివారం రోజు చేస్తుంటారు. అయితే, ఆదిత్య హృదయం లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. దీనిలో సండే చేయకూడని పనులు ఉన్నాయి.ప్రధానంగా ఆదివారం రోజు ఎవరు కూడా తలకు నూనెను పెట్టుకొకూడదు. దీని వలన అనేక దోషాలు అంటు కుంటాయి. దీనితో పాటు మద్యం, మాంసాన్ని కూడా ముట్టుకోకూడదు. కానీ చాలా మంది ఆదివారం సెలవు దినం కాబట్టి నాన్ వేజ్ తెచ్చుకుంటారు. చాలా మంది పార్టీల పేరిట.. ఆదివారం తాగుతుంటారు. కానీ వీటి వలన వారికి చెప్పలేని దోషాలు వచ్చిపడతాయి.ఇక ఆదివారం నాడు కొంత మంది వంటకాలలో ఉప్పును ఉపయోగించరు. కేవలం, చప్పగానే తింటుంటారు. దీని వలన సూర్యుడు ప్రీతి చెందుతాడని భావిస్తుంటారు. అదే విధంగా.. ఆదివారం పెళ్లైన వారు… స్త్రీ, పురుషులు దూరంగా ఉండాలి. రతీ జరపరాదు. ఆ ఒక్కరోజు మాత్రమే దంపతులు శారీరకంగా కలవకూడదు.అదే విధంగా, ఇటు నూనె తో చేసిన పదార్థాలను కూడా తినరాదు.

Also Read : జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా..?

తలకు నూనెను పెట్టుకొవద్దు. మద్యం, మాంసం తినకూడదు.మనకు సూర్యుడు ఎప్పుడు కన్పిస్తుంటాడు. స్నానంచేసిన తర్వాత.. ఆయనను నమస్కరించుకోవాలి. సూర్యుడికి నమస్కారించడం వలన ఎంతో ఆనందపడతాడు.అందుకే స్యూర్యుడిని అలంకార ప్రియుడు అంటారు.మనం కేవలం రెండు చేతులు జోడించి నమస్కరిస్తే సూర్యుడి ఎంతో ఆనందపడతాడు. మనం కోరిన కొర్కెలను తీరుస్తాడు. శనిభగవానుని తండ్రి సూర్యుడు.కాబట్టి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే.. శనిబాధలు కూడా మనకు ఉండవు. మనకు దరిదాపుల్లోకి కూడా శనిదేవుడు తొంగి చూడడు. ఇలాంటి నియమాలను పాటించాలని కొంత మంది జ్యోతిష్యులు తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube